ఈ మధ్యకాలంలో పలు వివాదాలతో వార్తల్లోకెక్కింది ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైనప్పటి నుండి వివాదం మొదలైంది. ఇందులో తమిళ టైగర్స్ ను ఉగ్రవాదులుగా చూపించారని మండిపడ్డారు. ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో విషయం పెద్దదైంది. సమంత ఎల్టీటీఈ సభ్యురాలిగా నటించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో ఆమెని బాగా ట్రోల్ చేశారు.
రీసెంట్ గా సిరీస్ విడుదలైన తరువాత అందులో వివాదాస్పద అంశాలు పెద్దగా లేకపోవడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్లీ వివాదం మొదలైంది. ఈ సిరీస్ తమిళుల మనోభావాలను కించపరిచేలా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ సిరీస్ ను వెంటనే నిలిపివేయాలని నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్ అమెజాన్ సంస్థకు ఆదివారం లేఖ రాశారు. వెంటనే ఈ సిరీస్ ను టెలికాస్ట్ చేయడం ఆపకపోతే తమిళులంతా అమెజాన్ సంస్థ సర్వీసులన్నింటినీ బాయ్ కాట్ చేస్తారని హెచ్చరించారు.
సీమాన్ తో పాటు డీఎంకే, ఎండీఎంకే అధినేత వైగో వంటి రాజకీయ నాయకులు కూడా ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్చేస్తున్నారు . రాష్ట్ర ప్రభుత్వం కూడా ది ప్యామిలీ మెన్–2 వెబ్‌సిరీస్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!