Yashoda: యశోద సినిమా సమంతకు కలిసొచ్చేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ఈ మధ్యకాలంలో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే హరి హరీష్ దర్శకత్వంలో సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన సినిమా యశోద. ఈ సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇకపోతే సమంత అనారోగ్య సమస్యల కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇతర చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఇందులో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ అందరిని కట్టిపడేస్తున్నాయి. ఇలా ఈ సినిమా టీజర్ చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా సమంతకు మంచి పేరు తెచ్చిపెడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇవ్వడమే కాకుండా సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు.ఇక తాజాగా ఈ సినిమా రన్ టైం కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా వీక్షించిన అనంతరం ఈ సినిమాకి 135 నిమిషాలు అనగా రెండు గంటల 15 నిమిషాల రన్ టైం లాక్ చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఈ రన్‌టైం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందని పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా రన్ టైం పై స్పందించి కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus