Samlan Kahan: సల్మాన్‌ క్లారిటీ ఇచ్చేశాడు.. ఇక రచ్చ రచ్చే!

సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో రామ్‌చరణ్‌.. గత కొద్ది నెలల నుండి ఈ పుకారు వినిపిస్తూనే ఉంది. అయితే ఎక్కడా, ఎప్పుడూ, ఎవరూ ఈ విషయంలో స్పందించలేదు. దీంతో అసలు సల్మాన్‌ సినిమాలో రామ్‌చరణ్‌ నటించాడా? నటిస్తే ఎందుకు నటించాడు? అనే ప్రశ్నలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక క్లారిటీ ఎప్పుడొస్తుంది అంటే.. సినిమా విడుదలైనప్పుడో, లేక ఆ సినిమా ప్రచారంలోనో అని అనుకున్నారంతా. కానీ వారందరికీ షాకిస్తూ సల్మాన్‌ ఖాన్‌ ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు.

‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల ముంబయిలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ ఇతర ముఖ్యపాత్రధారులు హాజరయ్యారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తన సినిమాలో రామ్‌చరణ్‌ నటించిన విషయాన్ని చెప్పేశాడు. ‘చిరంజీవి సినిమాలో మీరు నటించారు.. మరి మీ సినిమాలో రామ్‌చరణ్‌ నటించాడట కదా’ అని అడిగితే.. తొలుత చెప్పడానికి ఇష్టపడని సల్మాన్‌.. తర్వాత చెప్పేశాడు.

సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా ‘కిసీ కా భాయ్‌… కిసీ కా జాన్‌’లో టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో వెంకటేశ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఓ పాటలో కలసి డ్యాన్స్‌ వేశారు అని సమాచారం ఇంతకుముందే ఉంది. అయితే ఆ పాటలోనే రామ్‌చరణ్‌ కూడా తళుక్కున మెరిశాడు అని వార్తలొచ్చాయి. ఇప్పుడు అవి పుకార్లు కావు, నిజాలే అని తేలిపోయింది. రామోజీ ఫిలిం సిటీలో సల్మాన్‌, వెంక‌టేష్, రామ్‌చరణ్‌ మీద ఆ పాట షూట్‌ చేశారట.

ఆ స్పెషల్‌ సాంగ్‌ కోసం సల్మాన్‌, వెంకటేశ్‌ రెడీ అవుతుంటే.. చ‌ర‌ణ్ వ‌చ్చి క‌లిశాడ‌ట. పాట సంగతి తెలుసుకుని తాను కూడా ఆ పాట‌లో భాగం కావాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడట. దానికి సల్మాన్‌ ఖాన్‌ తొలుత వద్దన్నాడట. కానీ చ‌ర‌ణ్ విన‌కుండా మ‌రుస‌టి రోజు కార‌వాన్ తీసుకుని, త‌న కాస్ట్యూమ్ త‌నే రెడీ చేసుకుని షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చేశాడట. అలా ఆ పాటలో భాగమయ్యాడట.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus