Sampoornesh Babu: ఆడపిల్లల బాధ్యత తీసుకున్న సంపూర్ణేష్ బాబు!

హృదయ కాలేయం సినిమాతో ఓవర్ నైట్ లో సంపూర్ణేష్ బాబు పాపులారిటీని సంపాదించుకున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే సంపూర్ణేష్ బాబు హీరోగా కొబ్బరిమట్ట సినిమా ప్రారంభం కాగా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంపూర్ణేష్ బాబు కొన్ని కారణాల వల్ల మధ్యలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే తాజాగా ఒక మంచి పని చేయడం ద్వారా సంపూర్ణేష్ బాబు వార్తల్లో నిలిచారు.

ఆదాయం అంతంత మాత్రమే అయినా దానం విషయంలో మాత్రం సంపూర్ణేష్ బాబు కర్ణుడు అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ప్రాంతానికి చెందిన నరసింహాచారి దంపతులు ఉపాధి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. గత నెల మే 1వ తేదీన నరసింహాచారి భార్య దేవేంద్ర మృతి చెందగా జూన్ నెల 21వ తేదీన నరసింహాచారి మృతి చెందారు. తల్లిదండ్రుల ఆత్మహత్యతో అక్కాచెల్లెళ్లు గాయత్రి, లక్ష్మీప్రియ అనాథలయ్యారు. సంపూర్ణేష్ బాబు నిన్న గాయత్రి,

లక్ష్మీప్రియలను పరామర్శించడంతో పాటు 25వేల రూపాయల విలువైన చెక్కును వారికి అందజేసి గొప్పమనస్సును చాటుకున్నారు. గాయత్రి, లక్ష్మీప్రియలకు అండగా ఉండటంతో పాటు వారి ఉన్నత చదువులకు అవసరమైన సహాయం చేస్తామని సంపూర్ణేష్ బాబు వెల్లడించారు. అనాథలైన ఇద్దరు ఆడపిల్లల చదువుకు హృదయ కాలేయం డైరెక్టర్ స్టీఫెన్ శంకర్ కూడా తోడ్పాటు అందిస్తారని సంపూర్ణేష్ బాబు వెల్లడించారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు స్టార్ హీరోల కంటే సంపూ భేష్ అని కామెంట్లు పెడుతున్నారు.


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus