Martin Luther King OTT: ఓటీటీలో సందడి చేయనున్న సంపూర్ణేశ్ బాబు..ఎప్పుడంటే..!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హృదయం కాలేయం, కొబ్బరి మట్ట అనే కామెడీ సినిమాల తో అద్భుత విజయం అందుకొని కామెడీ పాత్రలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల అయింది.. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మంచి సినిమాగా ప్రశంసలు అందుకున్నా కూడా కమర్షియల్‌గా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే థియేటర్స్ లో అలరించిన (Martin Luther King) మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీలోకి రాబోతోంది.ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో రిలీజ్ కానుంది. నవంబర్ 17 లేదా 24లలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రెండింటిలో ఫైనల్ డేట్ ఏదన్నది త్వరలోనే క్లారిటీ రాబోతున్నట్లు తెలిసింది. మార్టిన్ లూథర్‌కింగ్ సినిమాలో సంపూర్ణేష్‌బాబుతో పాటు సీనియర్ నరేష్‌ మరియు డైరెక్టర్ వెంకటేష్ మహా ముఖ్య పాత్రలు పోషించారు.

వెంకటేష్ మహా ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించాడు. మరి త్వరలో రానున్న మార్టిన్ లూథర్‌కింగ్ ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. మార్టిన్ లూథర్ కింగ్‌ సినిమా కు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు.తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్‌గా మార్టిన్ లూథర్ కింగ్ రూపొందింది.మండేలా మూవీ లో తమిళ్ స్టార్ కమెడియన్ యోగి బాబు నటించారు. యోగి బాబు పాత్రను తెలుగులో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా లో సంపూర్ణేష్ బాబు నటించాడు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus