Virupaksha: విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ తనేనా?

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం విరూపాక్ష ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించిందని చెప్పాలి థియేటర్లో మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలోనూ, టెలివిజన్లో కూడా ఈ సినిమా అద్భుతమైన రేటింగ్ కైవసం చేసుకుంది.

ఇలా ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ ఆయన అనంతరం సాయి ధరమ్ తేజ్ తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు. తాజాగా ఈయన బ్రో సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా విరూపాక్ష సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరూపాక్ష సినిమాలో సాయిధరమ్ తేజ్ కు జోడిగా సంయుక్త మీనన్ నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మొదటి ఛాయిస్ సంయుక్త కాదని తెలుస్తుంది.

ఇలా సంయుక్త మీనన్ కంటే ముందుగా ఈ సినిమాలో నటి సాయి పల్లవి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు చర్చించుకున్నారట. నాచురల్ బ్యూటీగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచించినప్పటికీ ఒకే ఒక కారణంతో ఈ సినిమాలో సాయి పల్లవి కాకుండా సంయుక్తను తీసుకున్నారని తెలుస్తోంది. సాయి పల్లవి నటనపరంగా డాన్స్ పరంగా ఎంతో గొప్పగా నటిస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.

ఇలా సాయి పల్లవి నటన ముందు హీరోల పాత్ర కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తుంది అందుకే (Virupaksha) ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకుంటే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రని హీరో పాత్రను డామినేట్ చేస్తుందని,అందుకే సాయి పల్లవి కాకుండా ఈ సినిమాకు సంయుక్త మీనన్ ఎంపిక చేసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో సంయుక్త భాగమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సాయి పల్లవి అయ్యి ఉంటే సినిమా మరో లెవెల్ లో హిట్ అయ్యేది అని కొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus