Samyuktha Menon: రెండుసార్లు డిగ్రీ ఫీజు కట్టాను… కానీ అవ్వలేదు: సంయుక్త

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యాను.. ఈ మాట చాలామంది నటుల నుండి విని ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్‌ లేటెస్ట్‌ గోల్డెన్‌ లెగ్‌ సంయుక్త కూడా ఇదే మాట చెప్పింది. అయితే తన కెరీర్‌ సినిమాలవైపు ఎందుకొచ్చింది, ఏం జరిగింది అనే విషయాలను ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దాంతోపాటు తన చదువు గురించి కూడా చెప్పింది. దీంతో సంయుక్త కూడా మనలాగే అంటూ ఫ్యాన్స్‌ ముచ్చటపడుతూ షేర్‌ చేస్తున్నారు.

సంయుక్తకు చదువు అంటే చాలా ఇష్టమట. అందుకే ఇప్పుడు కథానాయికగా బిజీగా ఉన్నా.. చదువును కొనసాగించాలని ఫిక్స్‌ అయ్యింది. అందుకే డిగ్రీ పరీక్ష రాసి గ్రాడ్యుయేట్‌ పూర్తి చేయాలని చూస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రైవేటుగా డిగ్రీ చేయాలని అనుకుందట. దీని కోసం రెండుసార్లు డిగ్రీ కోసం ఫీజులు కట్టిందట. అయితే సినిమాలతో డేట్స్‌ కుదరక ఆగిపోయిందట. వరుస సినిమాల వల్ల టైమ్‌కి డిగ్రీ అసైన్‌మెంట్లు పూర్తిచేయలేకపోయింద. దీతో మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది అని చెప్పింది.

అయితే కుదరడం లేదు కదా అని చదవడం మానేయలేదట సంయుక్త. కాస్త సమయం దొరికితే వెంటనే నవలను బయటకు తీస్తుందట. అంతగా చదవడం అంటే ఆమెకు చాలా ఇష్టం. అంతేకాదు సినిమా రిఫరెన్స్‌ల కోసమూ పుస్తకాలు చదువుతుందట. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి రోజుల్లో వరుసగా సినిమాలు చేయడం వల్ల డిగ్రీ చేయలేకపోయానని, ఇప్పుడు కాస్త టైమ్‌ దొరికే అవకాశం ఉంది కాబట్టి.. అలాగే ఫైనాన్సియల్‌గా స్థిరపడ్డాను.. అందుకే ఇకనైనా డిగ్రీ పూర్తిచేయడం మీద దృష్టి పెడతాను అని చెబుతోంది.

అలా తను ఇంట్లోవాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పింది (Samyuktha Menon) సంయుక్త. ఇక ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏంటి అంటే.. నటనను వీలైనన్ని రోజులు కొనసాగించడం, సేవారంగంలో అడుగుపెట్టడం లాంటి ఆలోచనలు ఉన్నాయట. వీటితోపాటు దర్శకత్వంవైపు కూడా వచ్చే ఆలోచన ఉందని చెప్పింది. ఇక సినిమాల సంగతి చూస్తే… ప్రస్తుతం ఆమె చేతిలో కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ ఒక్కటే ఉంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus