Samyuktha Menon: రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిన సంయుక్త మీనన్!

‘భీమ్లానాయక్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది నటి సంయుక్త మీనన్. ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపే వచ్చింది. ఈమెను టాలీవుడ్ కి తీసుకొచ్చింది త్రివిక్రమ్ అనే మాటలు గతంలో వినిపించాయి. దానికి తగ్గట్లే ‘భీమ్లానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ను తన గురువని చెబుతూ తెగ పొగిడేసింది సంయుక్త. ఈ బ్యూటీకి ‘సార్’ సినిమాలో ఛాన్స్ కూడా త్రివిక్రమే ఇప్పించారని టాక్. అంతేకాదు.. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందించనున్న సినిమాలో ఒక హీరోయిన్ గా సంయుక్తను తీసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

మెయిన్ హీరోయిన్ పూజాహెగ్డే కాగా.. సంయుక్త సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుందని వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది సంయుక్త మీనన్. త్రివిక్రమ్, మహేష్ సినిమాలో తను ఉన్నాననేది కేవలం స్వీట్ రూమర్ మాత్రమేనని చెప్పింది. ఇందులో నిజం లేదని.. మహేష్ బాబు గారి సినిమాలో నటించడం లేదని తెలిపింది. ఇలాంటి రూమర్స్ రాయాలంటే చాలా క్రియేటివిటీ కావాలంటూ వెటకారంగా మాట్లాడింది సంయుక్త.తను నటిస్తోన్న ‘సార్’ సినిమాకి సంబంధించి కూడా ఇలాంటి రూమర్స్ వినిపించాయని..

షూటింగ్ సమయంలో ధనుష్ తో విబేధాలు వచ్చి సెట్స్ నుంచి వెళ్లిపోయినట్లు రాశారని గుర్తుచేసుకుంది ఈ బ్యూటీ. ఇలాంటి రూమర్స్ ఎలా పుట్టిస్తారో తెలియదు కానీ వారి సృజనను మెచ్చుకోవాల్సిందే అంటూ ఫన్నీగా రియాక్ట్ అయింది. ఒకప్పుడు రూమర్స్ విని భయం వేసేదని.. ఇప్పుడు మాత్రం రూమర్స్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘బింబిసార’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus