సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా శుక్రవారం (ఈరోజు) విడుదల అవుతోంది. మొదట ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చెయ్యాలని అనుకున్నారు కానీ, టైమ్ సరిపోకపోవటంతో ఒక్క తెలుగులోనే విడుదల అవుతోందని చెప్పారు. ఈ సినిమా నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఇందులో కథానాయకురాలిగా చేసిన సంయుక్త ని ‘గోల్డెన్ లెగ్’ అని అనటం, ఆ తరువాత అందువల్లనే మీరు ఈ సినిమాలో ఈ పాత్రని దక్కించుకున్నారా అని అడిగిన ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది సంయుక్త. అసలు ఆ గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ కాన్సెప్ట్ అనేదే చాలా బాడ్ అని చెప్పింది.
“ఒక అమ్మాయి లక్కీ అని ఆమెని సినిమాలోకి ఒక పాత్రని ఎంపిక చెయ్యడం అనే కాన్సెప్ట్ నేను నమ్మను. మేము చాలా హార్డ్ వర్క్ చేస్తాము, అలాగే మా ప్రయత్నాలు మేము చేస్తాము, అందువల్ల మాకు సక్సెస్ వస్తుంది. అంతే కానీ ఆమె గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ ఈ కాన్సెప్ట్ అసలు ఎప్పుడూ వర్క్ అవుట్ కాదు,” అని చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.
“ఒక స్క్రిప్ట్ కి, లేదా ఒక పాత్రకి ఒక అమ్మాయి న్యాయం చేస్తుంది అంటే ఆమెని ఆ సినిమాలోకి తీసుకుంటారు. అలాగే ఆమె ప్రతిభ మీద చాలా ఆధారపడి ఉంటుంది, అంతే కానీ కేవలం లక్కీ అని తీసుకోవటం అనేది జరగదు. దీన్ని వదిలేద్దాం ఎందుకంటే ఇది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, ఇది చాలా ఏళ్ల కిందట అనుకునే మాటలు”, అని సంయుక్త చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మరి అడిగిన అతనికి ఆమె మాటలు అర్థం అయ్యాయో లేదో! మలయాళం నటి అయిన (Samyuktha Menon) సంయుక్త తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ తో ఎంట్రీ ఇచ్చింది, తరువాత ‘బింబిసార’ సినిమాతో ఇంకో హిట్ కొట్టింది. ఈమధ్య విడుదల అయిన ‘సర్’ సినిమాలో ధనుష్ పక్కన చేసి మంచి పేరు తెచ్చుకుంది, అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ‘విరూపాక్ష’ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలపగలరు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!