నాకో హిట్ ను పోగొట్టాడు ఆ ప్రొడ్యూసర్

మొన్నామధ్య ఎస్.కె.బషీద్ అనే ప్రొడ్యూసర్ ‘ప్రొజెక్ట్ జెడ్’ అనే డబ్బింగ్ సినిమా విషయంలో సందీప్ కిషన్ మీద దారుణమైన కామెంట్స్ చేయడం తెలిసిందే. ముఖ్యంగా సందీప్ కిషన్ వల్ల తనకు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని ఆయన మీడియా ముఖంగా కామెంట్ చేయడం, ఆ సమయంలో సందీప్ ఈ విషయమై స్పందించకుండా ఉండడంతో అందరూ సందీప్ దే తప్పేమో అనుకొన్నారు. అయితే.. ఇన్నాళ్ల తర్వాత తన తాజా చిత్రం “మనసుకు నచ్చింది” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన సందీప్ కిషన్ బషీద్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. అసలు ఆ ప్రొడ్యూసర్ పబ్లిసిటీ కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. పైగా నన్ను చాలాసార్లు ఇబ్బందిపెట్టాడు. ముఖ్యంగా నాకు నరకం చూపించాడు అంటూ మనసులో మాటలు వెళ్ళగక్కిన సందీప్ కిషన్ “మనసుకు నచ్చింది” సినిమా గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాకి జెమినీ కిరణ్ గారు నన్ను సజెస్ట్ చేశారు.

మంజుల గారు నన్ను కలిసినప్పుడు నేను కంప్లీట్ గా నక్షత్రం లుక్ లో ఉన్నా.. గెడ్డంతో కంప్లీట్ గా ట్యాన్ అయిపోయి ఉన్నాను.. అప్పుడు న్యారేట్ చేశారు నాకు ఈ స్టోరీని. నక్షత్రం లో నా క్యారెక్టర్ కి ఈ సినిమాలో క్యారెక్టర్ కి చాలా తేడా ఉంటుంది. సినిమాలో లవ్ స్టోరీతో పాటు నేచర్ ఉంటుంది. అసలు మనం మన లైఫ్ ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సినిమాతో మనల్ని మనం కలుసుకునే ప్రయత్నం చేస్తాం. అదే ఈ సినిమా కాన్సెప్ట్. సినిమా విషయంలో స్క్రిప్ట్ స్టేజ్ లో ఏదైతే అనుకుంటామో అది కొన్నిసార్లు సరిగ్గా అలాగే ఎగ్జిక్యూట్ చేయడం కుదరకపోవచ్చు. కానీ మంజుల గారు ఏదైతే మాకు చెప్పారో, ఆవిడ ఏది అనుకున్నారో సరిగ్గా అలాగే తెరకెక్కించారు. ఆ క్రెడిట్ ఆవిడకే దక్కుతుంది. సినిమాలో నా క్యారెక్టర్ బేసిగ్గా చాలా మంచోడు. కానీ దేన్నీ సీరియస్ గా తీసుకోడు. ఒక రకంగా చెప్పాలంటే.. కన్ఫ్యూజ్డ్ ఇడియట్” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus