Prabhas: పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నా అంటున్న డైరక్టర్‌.. అంచనాలు అమాంతం పెంచేలా మాటలు!

ప్రభాస్‌ లాంటి కటౌట్‌కి ఫుల్‌ మాస్‌ సినిమా పడి, యాక్షన్‌ సీన్స్‌తో నిండిపోయి ఉంటే.. ఆ ఫీలే వేరు. ఎందుకంటే మాస్ మసాలా యాక్షన్‌ సినిమాలో ప్రభాస్‌ కనిపించి చాలా రోజులైంది. ‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఆ తర్వాత అన్నీ లార్జర్‌ దేన్‌ లైఫ్‌ పాత్రలే వస్తున్నాయి. దీంతో నాటి మోస్ట్‌ లవ్డ్‌ ప్రభాస్‌ కనిపించడం లేదు. అయితే ఇలాంటి అన్ని ఫీలింగ్స్‌ని పోగొడతా అంటున్నారు సందీప్‌ రెడ్డి వంగా.

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత అదే సినిమా రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’తో బాలీవుడ్‌కి వెళ్లిన సందీప్‌ రెడ్డి వంగా.. ఇప్పుడు ‘యానిమల్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సందీప్‌ రెడ్డి వంగా ఆ తర్వాత ప్రభాస్‌ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టిపెడతారట. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రభాస్‌తో తాను చేయబోయే సినిమాపై ఎన్ని అంచనాల ఉన్నాయో తనకు తెలుసునని.. వాటిని నెరవేర్చేలా ప్రభాస్ కోసం బలమైన, ప్రతిష్ఠాత్మకమైన కథను రాస్తున్నాను అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఆ స్క్రిప్ట్‌ కచ్చితంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రిక్వైర్‌మెంట్స్‌ను ఫుల్‌ఫిల్‌ చేసేలా ఉంటుందని చెప్పారు. ‘ప్రభాస్ తో ‘రా అండ్ పవర్‌ఫుల్ యాక్షన్’ సినిమా చేయాలనే తన ఉద్దేశమని సందీప్ గతంలో వెల్లడించాడు.

ఆ ప్రపంచానికి తగ్గట్టు పాయింట్‌ సిద్ధంగా ఉందని, పూర్తి స్థాయి కథను సిద్ధం చేసి సినిమా షురూ చేస్తారని సమాచారం. అయితే ఇందులో ప్రభాస్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారని, డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. సినిమా పేరు, లోగో లుక్‌ చూసి ఈ పుకార్లు వచ్చాయి. అయితే నిజంగా కథలో ఏముంది అనేది తెలియాల్సి ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus