కుర్ర దర్శకులకు సినిమా అవకాశాలు కావాలంటే, లేదా చాలా రోజుల నుండి కథలు పట్టుకుని తిరుగుతున్న దర్శకులకు ఊతం కావాలంటే మెగాస్టర్ దగ్గరకు రావాల్సిందేనా? ఏమో ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఆయన వరుసగా కథలు వింటున్న దర్శకులు, అవకాశాలు ఇస్తున్న దర్శకులు అలాంటివారే కావడం విశేషం. కావాలంటే చిరంజీవి సినిమాలు చేస్తున్న దర్శకులు చూడండి మీకే తెలుస్తుంది. దాంతో పాటు ఆయనకు వినిపిస్తున్న దర్శకులూ అంతే. ఇప్పుడు ఈ జాబితాలో మరో దర్శకుడు వచ్చి చేరారా?
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ‘ఆచార్య’ దర్శకుడు కొరటాల శివ, త్వరలో చేయబోతున్న ‘లూసిఫర్’ రీమేక్ దర్శకుడు మోహన్ రాజా తప్పిస్తే మిగిలిన అందరూ తమ ఛాన్స్ కోసం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న వారే. ‘వేదాళం’ రీమేక్ చేస్తున్న మెహర్ రమేష్ చాలా రోజుల నుండి ఖాళీగా ఉన్నాడు. కొన్ని సినిమా ప్రయత్నాలు చేసినా కుదర్లేదు. బాబి విషయానికొస్తే… ‘వెంకీమామ’ తర్వాత ఖాళీగానే ఉన్నారు. ఏం చేస్తాడా అని అనుకుంటుండగా చిరంజీవి సినిమా ఓకే అయ్యింది.
రెండేళ్ల క్రితం ‘మహర్షి’తో వచ్చిన వంశీ పైడిపల్లి ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమా ఓకే చేయించుకోలేదు. మహేష్‌తోనే సినిమా ఉంటుందని వార్తలొచ్చినా ఓకే అవ్వలేదు అని వార్తలొచ్చాయి. అయితే ఇటీవల చిరంజీవికి కథ చెప్పాడని వార్తలొచ్చాయి. అయితే రిజల్ట్ ఏంటో తెలియలేదు. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిరును కలిశాడని టాక్. ఈ క్రమంలో ఓ సినిమా పాయింట్ చిరుకి చెప్పారట. మరి ఈ లైన్ చిరు నచ్చిందా, ఓకే చేశారా అనేది తెలియడం లేదు. ఒకవేళ ఓకే అయితే ఇంత త్వరగా సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు. ఈ ‘యానిమల్’ డైరెక్టర్ కూడా క్యూలో ఉండాల్సిందే.