బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ పెద్ద చిచ్చు పెట్టింది. లెటర్స్ ( letters task ) శాక్రిఫైజ్ చేసిన బడ్డీలు రేస్ లోంచీ తప్పుకుంటే లెటర్స్ చదివిన వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. సందీప్, తేజ, గౌతమ్ ఇంకా పల్లవి ప్రశాంత్ నలుగురూ కూడా రంగు పడుద్ది అనే టాస్క్ ఆడారు. ఇందులో వైట్ టీషర్ట్ వేస్కున్న నలుగురు రింగ్ లో ఆడుతూ ఒకరి టీషర్ట్ పై ఒకరు రంగు పూసుకోవాలి. ఇలా ఎవరి టీషర్ట్ అయితే రంగుతో బాగా తడిసిపోతుందో వారు రేస్ నుంచీ తప్పుకుంటారు.
ఈ టాస్క్ కి సంచాలక్ గా ప్రియాంక చేసింది. ఇక్కడే ఫస్ట్ రౌండ్ లో సందీప్ మాస్టర్ పెద్ద గొడవ చేశాడు. మొదట టేస్టీ తేజని నెట్టేస్తే రింగ్ బయటకి కాలు పెట్టేశాడు. దీంతో తేజ అవుట్ అని డిక్లేర్ చేసిన సంచాలక్ తర్వాత ఎండ్ బజర్ మోగే వరకూ కూడా ఆడమని చెప్పింది. దీంతో టీషర్ట్ పై రంగు ఆధారంగా గేమ్ నుంచీ సందీప్ ని తప్పిస్తున్నాని చెప్పింది. దీంతో సందీప్ గొడవకి దిగాడు. ఆటలో పల్లవి ప్రశాంత్ నన్ను ముఖంపై కొట్డాడని అలాగైతే నేను కూడా కొట్టానా అంటూ మాట్లాడాడు.
తేజ లైన్ దాటితే తను అవుట్ అవుతాడు కానీ నేనెందుకు అవుతానని రెచ్చిపోయి వాగ్వివాదానికి దిగాడు. దీంతో రింగ్ బయట ఉన్న సందీప్ ఫ్రెండ్ అమర్ కూడా రెచ్చిపోయాడు. నిజానికి పల్లవి ప్రశాంత్ ని నెట్టినపుడు తను రంగు లో ముంచిన చేయి తీసి రాయబోతుంటే సందీప్ ముఖానికి అది గట్టిగా తగిలింది. ఎందుకంటే అప్పటికే ఆయన టీషర్ట్ లేచి పోయి ఉంది. ఆ టీషర్ట్ ముఖం పై ఉండటంతో పల్లవి ప్రశాంత్ రంగు చేయి ఆయనకి గట్టిగా తగిలింది. ఈ కింద ఫోటోలో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ( watch photo )
దీంతో సందీప్ మాస్టర్ సంచాలక్ ప్రియాంకని నిలదీస్తూ ఇన్ఫులెన్స్ చేసేశాడు. అక్కడ ఫస్ట్ సందీప్ అవుట్ అని చెప్పిన ప్రియాంక డెసీషన్ మార్చుకుని గేమ్ మద్యలో చెప్పిన తేజని అవుట్ చేసింది. రింగ్ నుంచీ బయటకి వచ్చాడు కాబట్టి నేను డెసీషన్ తీస్కున్నా అంటూ చెప్పింది. ఇక తర్వాత రౌండ్ లో సందీప్ మాస్టర్ ఎటాక్ చేసి ఓడిపోయాడు. ఒకవైపు ప్రశాంత్, మరోవైపు గౌతమ్ ఇద్దరూ కలిసి మాస్టర్ టీషర్ట్ ని పూర్తిగా రంగు మయం చేశారు.
ఫైనల్ గా గౌతమ్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరూ ఉన్నప్పుడు గేమ్ రసవత్తరంగా సాగింది. ఇద్దరిలో పల్లవి ప్రశాంత్ లాస్ట్ లో గౌతమ్ టీషర్ట్ కి పైయింట్ ఎక్కువగా పూయడం వల్ల పల్లవి ప్రశాంత్ ని విన్నర్ గా డిక్లేర్ చేసింది సంచాలక్ ప్రియాంక. గేమ్ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ నేరుగా వచ్చి సందీప్ తో సారీ చెప్పాడు. (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి మొదటి కెప్టెన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. అదీ మేటర్.