Sanghavi, Prithiveeraj: అబద్ధం చెప్పి సంఘవిని మోసం చేసిన పృథ్వీ.. ఏం జరిగిందంటే?

  • April 17, 2023 / 08:14 AM IST

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించి సక్సెస్ ను సొంతంచేసుకున్న నటీమణులలో సంఘవి ఒకరనే సంగతి తెలిసిందే. మోడలింగ్ తో కెరీర్ ను మొదలుపెట్టిన సంఘవి తెలుగులో సింధూరం సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నారు. అభినయ ప్రధాన పాత్రల్లో సంఘవి ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం. తాజాగా సుమ అడ్డా షో ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో పృథ్వీపై సంఘవి వేసిన పంచ్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. సంఘవి, ఆకాశ్, మహేశ్వరి, పృథ్వీరాజ్ ఈ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు.

సుమ పృథ్వీరాజ్ తో మీకు తలపై చాక్ పౌడర్ అంటినట్టుగా ఉందని చెప్పగా తుడవండి తుడవండి అంటూ పృథ్వీరాజ్ రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు. కలర్ వేశానని పృథ్వీరాజ్ చెప్పగా సుమ వెంటనే అందరూ డై తలకు వేసుకుంటే నేను తెల్లజుట్టు రాకుండా ఉండటానికి అన్నంలో కలిపి వేస్తున్నానని చెప్పి నవ్వుల పువ్వులు పూయించారు. నాకు అన్ని సిటీలలో రామోజీ ఫిల్మ్ సిటీ ఇష్టమని చెప్పి సుమ నవ్వించారు.

ఆ తర్వాత సంఘవి మాట్లాడుతూ రాత్రి 9.30 గంటల సమయంలో షూటింగ్ ఫినిష్ చేసుకుని వస్తున్నానని ఆ సమయంలో పృథ్వీరాజ్ తన భార్య గర్భవతి అని ఆమె కేక్ అడుగుతోందని వీళ్లు ఇవ్వడం లేదని చెప్పగా నేను సీరియస్ గా రెస్టారెంట్ కు వెళ్లి కేక్ తెచ్చి ఇచ్చానని సంఘవి కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ లో పృథ్వీరాజ్ భార్యను చూశానని ఆమెతో హౌ మెనీ మంథ్స్ అని అడగగా ఆ ప్రశ్న విని ఆమె షాకయ్యారని సంఘవి అన్నారు.

పృథ్వీరాజ్ వైఫ్ కోసమే కేక్ తీసుకెళ్లారని అయితే ఆమె గర్భవతి కాదని సంఘవి వెల్లడించారు. పృథ్వీ తనకు అబద్ధం చెప్పి మోసం చేశాడని సంఘవి పరోక్షంగా చెప్పుకొచ్చారు. మహేశ్వరి వెంటనే ఆయన ప్రెగ్నెంట్ ఏమో అప్పుడు అంటూ రివర్స్ లో పంచ్ వేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus