సానియా మీర్జాతో విడాకులు.. 3వ పెళ్లితో క్లారిటీ ఇచ్చినట్టేనా?

ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. 2010 లో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఎందుకంటే ‘భారత దేశానికి చెందిన అమ్మాయి.. ఓ పాకిస్థానీని పెళ్లి చేసుకోవడం ఏంటి?’ అంటూ చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసి సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దిష్టిబొమ్మలు తగలబెట్టారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడే ఊపందుకుంటున్న ఆ రోజుల్లో కూడా వీరి పెళ్లి వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించింది అనడంలో సందేహం లేదు.

అయితే వాటిని లెక్కచేయకుండా ఈ జంట సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా సానియా పై విమర్శలు ఆగలేదు. కానీ తర్వాత తర్వాత.. షోయబ్ మాలిక్ సొంత దేశం పాకిస్థాన్ కాదు, దుబాయ్ అంటూ మన వాళ్ళు సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత మాలిక్- సానియా లది సూపర్ పెయిర్ అంటూ ప్రశంసలు కూడా కురిపించారు.

అయితే రెండేళ్లుగా షోయబ్ మాలిక్ – సానియా మీర్జా (Sania Mirza).. దంపతులు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. కానీ దాని పై క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఊహించని విధంగా.. షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థానీ నటి అయిన సనా జావేద్ ని షోయబ్ మాలిక్ 3వ పెళ్లి చేసుకోవడం జరిగింది.

స్వయంగా షోయబ్ మాలిక్ తన ఇన్స్టాగ్రామ్లో సనా జావేద్ తో పెళ్లి చేసుకున్నట్టు ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. అయితే గతంలో అయేషా సిద్దికీ అనే అమ్మాయిని మొదటి పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. 2006 లో వీరు పెళ్లి చేసుకోగా 2010 లో విడాకులు తీసుకుని విడిపోయారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus