కుర్ర ‘మెగా’ హీరో సినిమాకు సైన్‌ చేసిన సంజూ.. మ్యాచ్‌ చేయగలడా?

ఇండియన్‌ సినిమాలో సంజయ్ దత్‌ (Sanjay Dutt) లాంటి నటుడు మరొకరు ఉండరు అని చెప్పాలి. ఆయన నటన, స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఆ రేంజిలో ఉంటాయి. అయితే ఆయన్ను జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతమైన పాత్రలు పండుతాయి. లేదంటే ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) లాంటి సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు లెండి కానీ.. ఆయన ఓ కొత్త సినిమా ఓకే చేశారు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సాయి తేజ్‌ (Sai Dharam Tej) కొత్త సినిమ ‘సంబరాల యేటి గట్టు’ (Sambarala Yeti Gattu Carnage) ఇటీవల అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

Sanjay Dutt

షూటింగ్‌ కూడా కొంత అయింది అని సమాచారం. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర కోసం సంజయ్‌ దత్‌ను తీసుకున్నారు అని సమాచారం. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటారు అని చెబుతున్నారు. దీంతో ఈ సినిమా మీద మరింత హైప్‌ పెరిగింది అని చెప్పాలి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌తో సినిమా మీద ఓ అంచనా ఏర్పడింది. ఇక సంజ‌య్‌ద‌త్ ఇప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాలు అందుకొంటున్నారు.

‘డ‌బుల్ ఇస్మార్ట్’ లో విల‌న్‌గా క‌నిపించిన సంజూ ప్రభాస్‌ (Prabhas)  ‘ది రాజాసాబ్’లో (The Rajasaab)  ఛాన్స్ అందుకున్నారు. బాలకృష్ణ(Nandamuri Balakrishna) – బోయపాటి (Boyapati Srinu) ‘అఖండ 2’లో (Akhanda)  ఆయనే ప్ర‌తినాయ‌కుడ‌ని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం అయితే రాలేదు. ఆయన తనయుడిగానే ఆది పినిశెట్టి నటిస్తున్నాడని టాక్‌. ప్ర‌స్తుతం ‘సంబరాల యేటి గట్టు’ సినిమా చిత్రీకరణ హైద‌రాబాద్‌లో జరుగుతోంది.

రోహిత్ (K.P. Rohith) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి క‌థానాయిక‌ (Aishwarya Lekshmi). రామ్ ల‌క్ష్మ‌ణ్ ఆధ్వర్యంలో ఫైట్ కంపోజ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే సంజయ్‌ దత్‌ సెట్స్‌లోకి వస్తారని కూడా చెబుతున్నారు. సుమారు రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. అలాగే ఈ సినిమాను వివిధ భాషల్లో సిద్ధం చేసి పాన్‌ ఇండియా రిలీజ్‌ చేస్తారట. ఆ లెక్కన సంజు ఎంపిక సరైన నిర్ణయమే అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus