Sanjay Dutt, Prabhas: ప్రభాస్ కోసం మారుతి పెద్ద ప్లానే వేశారు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ‘బాహుబలి’ తరువాత ఆయన చేసేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన ‘రాధేశ్యామ్’ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో నెక్స్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు.

వీటితో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు మారుతి. ప్రభాస్ డేట్స్ ఇవ్వగానే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలనుకుంటున్నారట మారుతి.

ఆ దిశగా చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాల్లో సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నారు. ‘కేజీఎఫ్2’, ‘శంషేరా’ వంటి సినిమాల్లో తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు సంజయ్ దత్. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించే సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం.

మరి దీనికి సంజయ్ దత్ ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హారర్ కామెడీ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus