Sanjay Dutt: షూటింగ్లో ప్రమాదానికి గురై గాయాలు పాలైన సంజయ్ దత్!

సంజయ్ దత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కే సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబుల్ స్మార్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరిస్తున్నారట ఈ క్రమంలోనే కొన్ని కత్తితో చేయాల్సిన సన్నివేశాలు ఉన్నటువంటి తరుణంలో నటుడు సంజయ్ దత్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఈ యాక్షన్ సన్ని వేషాలను చిత్రీకరించే సమయంలో సంజయ్ దత్ తలకు గాయం కావడంతో వెంటనే చిత్ర బృందం తనని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట అయితే ఈయనకు తలలో రెండు కుట్లు పడ్డాయని తెలుస్తుంది.

ఇలా కుట్లు వేయించుకున్న అనంతరం తిరిగి సినిమా షూటింగ్ లోకేషన్ లో పాల్గొన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు గురించి చిత్ర బృందం ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ బిగ్ బుల్ అనే పోస్టర్ తో ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇక సంజయ్ దత్ (Sanjay Dutt) ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియన్ సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus