Actress: నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం!

సంజీదా షేక్ బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు, సినీ అభిమానులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2003లో ‘బాగ్‌బన్‌’ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌తో కలసి నటించింది. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపురాలేదు. ఆ తర్వాత ఓ తమిళ, కన్నడ మూవీలో నటించన ఈ బ్యూటీకి ఫలితం లేదు. సరిగ్గా ఆ సమయంలోనే బాలాజీ టెలీఫిల్మ్స్‌ నిర్మించే ‘క్యా హోగా నిమ్మో కా’ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అందులో నిమ్మో పాత్రలో నటించి ప్రేక్షకులకు కనెక్టయ్యారు.

ఆ తర్వాత ‘కయామత్‌’ సీరియల్‌లో వేశ్య పాత్రలో నటించిన సంజీదా షేక్ కు ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఈమె బుల్లితెర నటిగా పాపులర్‌ కావటంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అదే సమయంలో ‘నాచ్‌ బలియో3’ డ్యాన్స్‌ షోలో ద్వారా సెలబ్రిటీ డ్యాన్స్‌ రియాలిటీ షో చేసింది. తరువాత ఓ పంజాబీ చిత్రంలో నటించింది. అందులో ఐటమ్‌ సాంగ్‌లో కనిపించిన సంజీదా షేక్ కు పెద్దగా అవకాశాలు రాలేదు.

దానితో తిరిగి హిందీ సీరియల్‌లో నటించింది. గెహరియాన్‌ అనే హారర్‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన సంజీదా కు మంచి పేరు వచ్చింది. అలాగే ఈమె మ్యూజిక్‌ వీడియోలు చేస్తోంది. రుకా హూన్‌.., బస్‌ ఏక్‌ బార్‌…, తుమ్‌ ఆవోగే.., జస్‌ మనాక్‌.. ఇలా దాదాపు పది మ్యూజిక్‌ వీడియోలు యూత్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్‌లో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం!

ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ జోడీగా ‘ఫైటర్‌’ లో నటిస్తున్న సంజీదా (Actress) గురించి కొన్ని విశేషాలివిగో… ‘‘ఎవరేమనుకున్నా బోల్డ్‌గా ఉండటం నాకిష్టం. అందాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేయటం తప్పు కాదు కదా! ఇన్‌స్టాలో నాలుగున్నర మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అసలు ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ అనుకోలేదని సంజీదా చెప్పుకొచ్చింది

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus