Sankranthiki Vasthunam: 100 కోట్ల ప్రాఫిట్స్.. టాప్ 10 లిస్టులో వెంకీ న్యూ రికార్డ్!

సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా తెలుగు బాక్సాఫీస్‌ను సునామీలా షేక్ చేసింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi)  దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh Daggubati) నటించిన ఈ సినిమా మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. పండగ సీజన్‌లో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా ఘనవిజయం సాధించింది. కామెడీ, మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది.

Sankranthiki Vasthunam

Sankranthiki Vasthunam Movie in 100 Cr Top Profit Records

తొలి వారం నుంచే భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. దీనితో నిర్మాతలు సుమారు 100 కోట్లకు పైగా ప్రాఫిట్‌ను క్యాష్ చేసుకున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వెంకటేష్ కెరీర్‌లోనే ఇదొక మెమోరబుల్ రికార్డ్ అని చెప్పొచ్చు. తెలుగు ప్రేక్షకులు పండగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను మరింత ఆదరించడంతో థియేటర్ల వద్ద రిపీట్ ఆడియన్స్ బాగా కనిపించారు.

ఇప్పటివరకు 100 కోట్ల ప్రాఫిట్ సాధించిన బాహుబలి (Baahubali) , ఆర్ఆర్ఆర్ (RRR), పుష్ప 2 (Pushpa 2) వంటి చిత్రాల జాబితాలో సంక్రాంతికి వస్తున్నాం కూడా చేరడం విశేషం. వెంకటేష్ తన కమర్షియల్ హవాను మరోసారి రుజువు చేస్తూ సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా సాధించిన రికార్డులు వెంకటేష్ అభిమానులను మరింత ఆనందానికి గురిచేశాయి.

దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు నిర్మాతల ఖాతాలో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్‌ని కూడా వేసింది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, 300 కోట్ల గ్రాస్ టార్గెట్‌ను చేరుకోవడానికి సిద్ధంగా ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. తెలుగు సినిమా గతంలో ఎన్నడూ చూడని విధంగా పండగ సినిమాల రేంజ్‌ను సంక్రాంతికి వస్తున్నాం కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ మూవీ ఓవర్సీస్, మల్టిప్లెక్స్‌లలో కూడా బాగా వసూళ్లను రాబట్టింది.

100 కోట్ల ప్రాఫిట్ సాధించిన టాప్ సినిమాలు:

బాహుబలి

బాహుబలి 2 (Baahubali 2)

ఆర్ఆర్ఆర్

పుష్ప 2

కల్కి 2898 AD (Kalki 2898 AD)

హనుమాన్ (Hanuman)

సంక్రాంతికి వస్తున్నాం

అనారోగ్యం పాలైన సాయి పల్లవి… ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus