విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ (F2 Movie) , ‘ఎఫ్ 3’ (F3 Movie) వంటి విజయవంతమైన సినిమాల తర్వాత రూపొందుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) . ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh)..లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2025 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ‘గోదారి గట్టు’ ఫస్ట్ లిరికల్ సాంగ్.. వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అనిల్ రావిపూడి వరుస సక్సెస్..లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. సంక్రాంతికి రెండు బ్లాక్ బస్టర్స్ కూడా ఇచ్చాడు. అందులో వెంకటేష్ ‘ఎఫ్ 2’ కూడా ఉంది. ఇక వెంకటేష్ కి సంక్రాంతి సీజన్ మొదటి నుండి బాగా కలిసొస్తుంది. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచాలని డిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలో టీజర్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీజర్ డిసెంబర్ 12న సాయంత్రం లేదా డిసెంబర్ 13న ఉదయం విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఆ రోజు టీజర్ ను విడుదల చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి అండ్ టీం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.