Ajith Vs Vishal: సంక్రాంతి వార్.. అజిత్ వర్సెస్ విశాల్!

ఈ సంక్రాంతికి రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఊహించని విధంగా లాస్ట్ మినిట్ లో ‘ఆర్ఆర్ఆర్’ని వాయిదా వేశారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం అందులో నిజం లేదని చెబుతూనే.. సోషల్ మీడియాలో సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ హింట్స్ ఇస్తున్నారు. ఎప్పుడైతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రావడం లేదని తెలిసిందో..

ఆ టైంకి రావడానికి చాలా సినిమాలు రెడీ అయిపోయాయి. అన్నీ కూడా చిన్న సినిమాలే. దాదాపు ఏడెనిమిది చిన్న సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా కూడా రాబోతుంది. ఈ సినిమాలే కాకుండా రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. విశాల్ హీరోగా దర్శకుడు శరవణన్ డైరెక్ట్ చేసిన ‘సామాన్యుడు’ సినిమా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు.

డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు అజిత్ నటిస్తోన్న ‘వాలిమై’ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని నిర్మాత బోణీ కపూర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్ గా కనిపించనున్నారు. చిన్న సినిమాలతో పాటు సంక్రాంతికి ఈ రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus