పొంగల్‌ ఫైట్‌… బాక్సాఫీసు దగ్గర ఎంత వెనక్కి వస్తుందో?

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు వస్తేనే ‘వామ్మో ఇంత పెద్ద పందెమా?’ అని అనుకునేవాళ్లు మన టాలీవుడ్‌ జనాలు. అయితే ఇప్పుడు అంటే 2024 సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రాబోతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఐదూ వస్తాయి.. లేదంటే నాలుగే వస్తాయి అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే ఆ ఐదు సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఎంత పందెం పెట్టి ఆడుతున్నాయి అనేది ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

ఏటా తెలుగు సినిమాలకు బెస్ట్‌ సీజన్‌ ఏంటి అంటే సంక్రాంతి అని చెబుతుంటారు. ఎందుకంటే ఆ సీజన్‌లో వచ్చే సెలవులు, సినిమా ప్రేక్షకుల ఎంజాయ్‌మెంట్‌ మూడ్‌ వల్ల ఒకటికి మించిన సినిమాలు చూసే అవకాశం ఉంది. అందుకేనేమో ఈ ఏడాది ఐదు సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీకి సిద్ధమవుతున్నాయి. మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’, తేజ సజ్జా – ప్రశాంత్‌ వర్మ ‘హను – మాన్‌’ ఈ నెల 12న థియేటర్లలోకి వస్తాయి. 14న నాగార్జున ‘నా సామి రంగా’ రిలీజ్‌ చేస్తున్నారు.

ఇక 13న వెంకటేశ్ – శైలేష్‌ కొలను ‘సైంధవ్‌’ రానుండగా… అదే రోజున రవితేజ – కార్తిక్‌ ‘ఈగల్‌’ను తీసుకొస్తున్నారు. ఈ సినిమాల థియేట్రికల్ రైట్స్‌ సంగతి చూస్తే… మొత్తంగా ఓ మూడు వందల కోట్లు అవుతోంది. ‘గుంటూరు కారం’ సినిమాను సుమారు రూ. 140 కోట్ల నుంచి రూ. 160 కోట్లకు పందెం పెట్టారట. మిగిలిన అన్ని సినిమాలకు ఒక్కో సినిమాకు రూ. 25 కోట్ల నుంచి రూ. 35 కోట్ల వరకు అయ్యిందట. ‘హనుమాన్‌’ (Hanuman) అయితే రూ. 15 కోట్లు అయ్యిందంటున్నారు.

మరి ఈ సినిమాలు థియేటర్ల దగ్గర ఏమేరకు జనాలను ఆకట్టుకుంటాయి, ఎంత మేర డబ్బులు వెనక్కు ఇస్తాయి అనేది చూడాలి. ముందుగా అనుకున్నట్లు సంక్రాంతి సీజన్‌లో జనాలు సినిమాలు బాగా చూస్తారు. కానీ మరి ఐదు సినిమాలు అంటే ఓవర్‌ డోస్‌ అని చెప్పొచ్చు. ఈ సమస్యను టాలీవుడ్‌ అధిగమించి భారీ వసూళ్లతో పొంగల్‌ ఫైట్‌లో అందరూ హీరోలే అనిపించుకోవాలని ఆశిద్దాం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus