Santosh Shoban: అయ్యయ్యో సంతోష్ శోభన్.. ఇక ఆ ఒక్క సినిమా పైనే ఆశలు..!

సినీ పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అంతా అంటుంటారు. కానీ హీరో సంతోష్ శోభన్ ను చూస్తే అది కూడా అబద్దమేనా అనిపిస్తుంది. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలోనే కుర్ర హీరోలకు పెద్ద బ్యానర్లలో కానీ, పెద్ద డైరెక్టర్లతో కానీ సినిమాలు చేసే అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే సంతోష్ కు మొదట్లోనే ఆ అవకాశాలు దక్కాయి.

మహేష్ బాబుతో ‘బాబీ’, ప్రభాస్ తో ‘వర్షం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శోభన్ గారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతనికి ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హీరోగా ‘తను నేను’ అనే సినిమా చేశాడు. ‘వయాకామ్’ వంటి బడా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కానీ సినిమా హిట్ అవ్వలేదు. తర్వాత ‘గీతా ఆర్ట్స్’ వారితో కలిసి దర్శకుడు సంపత్ నంది ‘పేపర్ బాయ్’ తో ఇతన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు.

అయినా ఇతనికి పెద్ద బ్యానర్ల నుండి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ‘యూవీ క్రియేషన్స్’ లో ‘ఏక్ మినీ కథ’, ‘మంచి రోజులు వచ్చాయి’ వంటి చిత్రాలు చేశాడు. మేర్లపాక గాంధీ, మారుతి వంటి పెద్ద దర్శకులు తీర్చిదిద్దిన సినిమాలు ఇవి. అయినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. అయితేనేం నాని తో ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి చిత్రాన్ని నిర్మించిన ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ వారు ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ వంటి చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన సినిమా.

కానీ ఇది కూడా ఆడలేదు. ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు సపోర్ట్ చేసినా ఇతని సినిమాలు ఆడటం లేదు. ఇక ఇతనికి ఉన్న లాస్ట్ ఛాన్స్ ‘అన్నీ మంచి శకునములే’ మూవీ. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ‘మహానటి’ ‘సీతారామం’ వంటి గొప్ప సినిమాలను అందించిన స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా సంతోష్ కు సక్సెస్ ను అందించి మంచి హీరోగా నిలబెడుతుందేమో చూడాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus