ఎప్పుడో పదేళ్ల క్రితం ‘గోల్కొండ హైస్కూల్’లో కెప్టెన్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు సంతోష్ శోభన్. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. ‘తను నేను’, ‘పేపర్‌బాయ్’ తదితర చిత్రాలతో కుర్రాడిలో విషయం ఉంది అని అనిపించుకున్నాడు. అయితే సరైన అవకాశం దొరకలేదు. దీంతో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ప్రభాస్ ప్రొడక్షన్ హౌస్ నమ్మి అవకాశం ఇచ్చింది. ‘ఏక్ మినీ కథ’ పేరుతో ఇటీవల ప్రేక్షకులు మందుకొచ్చాడు.
పదేళ్ల కెరీర్‌లో తొలి విజయం దక్కడం అంటే ఆ ఆనందాన్ని పట్టలేం. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు సంతోస్ శోభన్. అయితే కుర్రాడి ప్లానింగ్ ఈ సినిమాతోనే ఆగిపోలేదు. తర్వాతి సినిమా విషయంలో అంతే క్లారిటీగా ఉన్నాడు. మంచి నిర్మాతలనే లైన్‌లో పెట్టుకున్నాడు. సంతోష్ తర్వాతి సినిమాలు చూస్తే… వైజయంతీ మూవీస్ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది.
కొత్త దర్శకుడి ఈ సినిమాను రూపొందిస్తున్నారట. సారంగ ప్రొడక్షన్స్ సంస్థలో అభిషేక్ మహర్షి అనే మరో కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందట. ఇదంతా చూస్తుంటే సంతోష్ శోభన్ ఫ్యూచర్ ప్లాన్స్ గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మంచి విభిన్నమైన కథలు ఎంచుకొని సినిమాలు చేసి అలరించాలని ఆశిద్దాం.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!