హిట్ లేకపోతే.. ఆ నటుడు/ నటిని సరిగ్గా గుర్తించని స్థితిలో సినిమా పరిశ్రమ ఉంది. అందుకే స్టారే కానీ స్టార్ కాదు.. మొత్తం నిర్ణయించేది విజయమే అంటుంటారు మన పెద్దలు. అయితే ఓ కుర్ర హీరోకు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. సినిమా విజయాల విషయం అస్సలు ఆయన మీద, లైనప్ మీద ప్రభావం చూపించడం లేదు. అతనెవరో కాదు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. అవును.. ఆ కుర్ర హీరోనే. ‘ప్రేమ్ కుమార్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్.. లైనప్ చూస్తే మేం చెప్పిన విషయం ఈజీగా అర్థమైపోతుంది.
పరిశ్రమలో ప్రతిభ ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే అవకశాలు వస్తాయి, మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఫలితాల సంగతేమో కానీ.. అవకాశాలు మాత్రం వస్తున్నాయి ఈ కుర్రాడికి. అది కూడా చిన్న బ్యానర్లు కాదు.. టాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న బ్యానర్లలో ఛాన్స్‌లు కొట్టేస్తున్నాడు. ఆయా సినిమాల్లో తనదైన నటనను ప్రదర్శిస్తున్నాడు కానీ… అదృష్టం లేక విజయాలు అందుకోలేకపోతున్నాడు. తాజాగా వచ్చిన ‘ప్రేమ్ కుమార్’ పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో వరుస ఛాన్స్‌లు ఎలా అని అంటున్నారు నెటిజన్లు.
సంతోష్ శోభన్ (Santosh Sobhan) … దివంగత దర్శకుడు శోభన్ తనయుడు అన్న విషయం తెలిసిందే. ‘వర్షం’ సినిమాతో మెప్పించిన శోభన్ ఆ తర్వాత దురదృష్టవశాత్తు మనకు దూరమయ్యారు. ఆ సినిమా ఇచ్చిన అభిమానమో, లేక స్నేహమో కానీ సంతోష్ విషయంలో ప్రభాస్ చాలా కేరింగ్‌గా ఉన్నాడు. వరుసగా అవకాశాలు, సపోర్టు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లలో ఛాన్స్‌లు వస్తున్నాయి. సంతోష్ ‘గోల్కొండ హైస్కూల్’తో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘తను నేను’ చిత్రంతో హీరో అయ్యాడు. ఇప్పటిదాకా ఎనిమిది సినిమాల్లో నటించాడు.
ఆ తర్వాత ‘పేపర్ బాయ్’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ వెంటనే ‘ఏక్ మినీ కథ’ సినిమాతో ఓటీటీ ద్వారా వచ్చాడు. ఆ తర్వాత ‘మంచి రోజులొచ్చాయి’, ‘లైక్ షేర్ సబ్‌స్క్రయిబ్’, ‘కళ్యాణం కమనీయం’, ‘శ్రీదేవి శోభన్ బాబు’, ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘ప్రేమ్ కుమార్’గా వచ్చాడు. ఈ ఫలితాల ప్రభావం లేకుండా ఇప్పుడు యూవీ క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లలో సినిమాలున్నాయి.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?