Santosh Srinivas: రభస డైరెక్టర్ ను ఆ హీరోలు నమ్ముతారా?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన సంతోష్ శ్రీనివాస్ కందిరీగ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు. దర్శకునిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న ఈ దర్శకునికి రెండో సినిమాకు ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. అయితే రభస సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తెగ ఫీలయ్యారు. ఈ సినిమా తర్వాత తారక్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

రభస తర్వాత సంతోష్ శ్రీనివాస్ హైపర్, అల్లుడు అదుర్స్ సినిమాలను తెరకెక్కించగా ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమాల ఫలితాల వల్ల సంతోష్ శ్రీనివాస్ కు ఆఫర్లు తగ్గాయి. అయితే సరైన ప్రాజెక్ట్ దొరికితే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతానని సంతోష్ శ్రీనివాస్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పవన్ తో సినిమా చేయాలని సంతోష్ శ్రీనివాస్ ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదు.

పవన్ కళ్యాణ్ నుంచి నో అనే సమాధానం రావడంతో మెగా మేనళ్లుళ్లపై ఈ దర్శకుడు దృష్టి పెట్టాడని సమాచారం అందుతోంది. సాయితేజ్, వైష్ణవ్ తేజ్ లలో ఎవరో ఒకరు ఈ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది. సాయితేజ్, వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోల సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. యంగ్ హీరోలకు సరిపడే కథలు సంతోష్ శ్రీనివాస్ దగ్గర ఉన్నాయని సమాచారం అందుతోంది.

సంతోష్ శ్రీనివాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. ప్రతిరోజూ పండగే సినిమా తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం సాయితేజ్, ఉప్పెన తర్వాత ఆ స్థాయి సక్సెస్ కోసం వైష్ణవ్ తేజ్ ఎదురుచూస్తున్నారు. సాయితేజ్, వైష్ణవ్ తేజ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తమ రేంజ్ ను పెంచే సినిమాలకు ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus