సునీల్ (Sunil) జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత అతని స్నేహితుడు త్రివిక్రమ్ (Trivikram) సాయంతో కమెడియన్ గా మారాడు. తన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఆడియన్స్ ని అలరించాయి. ఒక దశలో సునీల్ టాలీవుడ్ నెంబర్ వన్ కమెడియన్ అనిపించుకున్నాడు. బ్రహ్మానందం(Brahmanandam), ఎం.ఎస్.నారాయణ (M. S. Narayana) వంటి స్టార్స్ ని పక్కకి తోశాడు. వాళ్లకి మించిన ఆఫర్లతో రోజులో కనీసం 3 గంటలు కూడా ఖాళీ లేకుండా గడిపాడు సునీల్.
తర్వాత హీరో అయ్యాడు. కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాడు. కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఆఫర్లు తగ్గాయి అనుకున్న టైంలో మళ్ళీ త్రివిక్రమ్ సాయంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఈ క్రమంలో ‘కలర్ ఫోటో’ (Colour Photo) ‘పుష్ప’ (Pushpa) సినిమాలు అతనికి మంచి బ్రేక్ ఇచ్చాయి. అందుకే పక్క భాషల్లో కూడా అతను బిజీగా రాణిస్తున్నాడు. ఇప్పుడు సప్తగిరి కూడా సునీల్ బాటలోనే నడవాలని ఆశపడుతున్నాడు. కమెడియన్ గా సప్తగిరి (Sapthagiri) సూపర్ సక్సెస్ అయ్యాడు.
‘కందిరీగ’ (Kandireega) ‘ప్రేమ కథా చిత్రం’ (Prema Katha Chitram) వంటి సినిమాల్లో అతని కామెడీ బాగా పండింది. అతని టైమింగ్ అందరికీ నచ్చింది. దీంతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. తర్వాత హీరోగా మారాడు. ఈ క్రమంలో చేసిన ఒకటి, రెండు సినిమాలు బాగానే ఆడాయి. కానీ అవకాశాలు తగ్గడంతో మళ్ళీ కమెడియన్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కమెడియన్ గా మారడం అతనికి ఇష్టం లేదట. సునీల్ లానే విలక్షణమైన పాత్రలు చేయాలని అతను భావిస్తున్నాడట.
ఆ సత్తా తనలో ఉందని తన ‘పెళ్ళి కాని ప్రసాద్’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. సప్తగిరి ఆలోచన బాగానే ఉంది. కానీ సునీల్ కి ఉండే హైట్, రఫ్ లుక్ .. వంటివి సప్తగిరిలో కనిపించవు. కాబట్టి.. సునీల్ రేంజ్లో విలక్షణమైన పాత్రలు సప్తగిరిని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు. మరి అతని ధైర్యం ఏంటన్నది అతనికే తెలియాలి..! ఇక అతని ‘పెళ్ళి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad) సినిమా మార్చి 21న విడుదల కానుంది.