నిన్న ఉదయం నుంచి ఓ పాట యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. ఆ మాటకొస్తే సోషల్ మీడియానే ఊపేస్తోంది అనుకోండి. ఆ పాటే ‘లవ్ స్టోరీ’సినిమాలోని ‘సారంగ దరియా’. సుమారు నాలుగు నిమిషాల పాట.. కుర్రకారును ఊపేస్తోంది. సుద్దాల అశోక్‌తేజ రాసిన సాహిత్యానికి పవన్ అందించిన సంగీతం, మంగ్లీ గొంతు.. వాటికి సాయిపల్లవి స్టెప్పులు. ఈ నాలుగింటి కాంబినేషన్ తెగ నచ్చేసినట్లుంది జనాలు తెగ చూసేస్తున్నారు ఆ పాటను. ఈ వార్త రాసినప్పటి అయితే 60 లక్షల మంది చూసేశారు. రియల్ టైమ్ లెక్కలు ఇంకా ఎక్కువే ఉంటాయి.
విడుదలైన రోజు ఇంత హిట్ కొట్టిన పాట మరో పాటను స్ఫూర్తి తీసుకొని రాసిందనే విషయం మీకు తెలుసా. తెలంగాణ సాహిత్యం, జానపదం మీద అవగాహన ఉన్నవారైతే ఠక్కున ఆ ఒరిజినల్ సాంగ్‌ను కూడా ఊహించేగలుగుతారు. ‘సారంగ దరియా’ అనే పాట చాలా రోజుల నుంచి తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. చాలా టీవీ షోస్‌లో ఈ పాటను చాలామంది గాయకులు ఆలపించారు. స్టేజీ షోలు, ప్రైవేలు ఆల్బమ్లు ఇలా చాలానే వచ్చాయి. అంతెందుకు ఓ ఆరేళ్ల క్రితం ‘అనగనగా ఒక చిత్రమ్’ అనే సినిమాలో కూడా ఈ పాట పల్లవిని వాడేశారు.
ఈ పాట గురించి శేఖర్ కమ్ముల ట్విటర్ వేదికగా స్పందించారు కూడా. ‘‘తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’కి సరికొత్త సొగసులద్ది, తనదైన శైలిలో మాకందించిన సుద్దాలకి వేలదండాలు. మాకీ పాట సేకరించి ఇచ్చిన రేలారే కోమలకు, చక్కటి బాణీలు కట్టిన పవన్, ఆలపించిన మంగ్లీ, అద్భుతంగా డ్యాన్స్ చేసిన సాయి పల్లవి, చేయించిన శేఖర్ మాస్టర్‌కి థ్యాంక్స్’’అన్నారు. మీరూ ఆ పాత పాటలు ఒకసారి చూసేయండి.
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!