#RIPSarathBabu అనే హ్యాష్ ట్యాగ్ నిన్న తెగ ట్రెండ్ అయ్యింది. సీనియర్ నటుడు.. శరత్ బాబు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారు అంటూ నిన్న తెగ ప్రచారం జరిగింది. దీంతో శరత్ బాబు ఫ్యామిలీ వెంటనే ఈ ప్రచారం పై రియాక్ట్ అయ్యి.. అందులో నిజం లేదు అని చెప్పారు. ఇప్పుడు శరత్ బాబుని వేరే రూమ్ కు షిఫ్ట్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చారు.
శరత్ బాబు కోలుకుంటున్నారని.. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ శరత్ బాబు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఏఐజి హాస్పిటల్ సిబ్బంది శరత్ బాబు హెల్త్ గురించి కీలక ప్రకటన విడుదల చేసింది. కొంతకాలంగా సెప్సిస్ వ్యాధితో శరత్ బాబు బాధపడుతున్నారని… పరిస్థితి విషమించడంతో ఏఐజీ ఆస్ప త్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. ఈ రోజు (గురువారం ఏప్రిల్ 4) కూడా ఆయన పరిస్థితి క్లిష్టంగానే ఉంది.
ఆయన (Sarath Babu) వైటల్స్ స్థిరంగానే ఉన్నాయి. ఆయనకి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్య స్థితి పై ఎప్పటికప్పుడు మీడియాకి వివరాలు అందిస్తాం అంటూ వైద్య బృందం తెలియజేసింది. శరత్ బాబు కుటుంబ సభ్యులు, వైద్యులు తప్ప ఎవరు ఏమి చెప్పినా నమ్మొద్దు అని కూడా వారు చెప్పుకొచ్చారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం శరత్ బాబు చనిపోయారని… కానీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారని అంటున్నారు.
సెలబ్రిటీలు చనిపోతే ఆ న్యూస్ ను కుటుంబ సభ్యులు వెంటనే మీడియాకి చెప్పడం లేదు. పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్లు చనిపోయినప్పుడు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి వారి విషయంలో కూడా ఇలాగే జరిగిందని కొందరు అంటున్నారు.