భారీ అంచనాలతో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం బాక్సాఫీసు వద్ద తొలి రోజు మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక రివ్యూల పరంగా చూస్తే ఎక్కువ శాతం యావరేజ్ రేటింగే వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడం, సినిమా టాక్ తెలియక ముందే భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగడంతో ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో తొలిరోజు ఈ చిత్రం రూ. 5 కోట్ల పైనే వసూలు చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్ సాధించిన చిత్రం ఇది మాత్రమే అని అంటున్నారు. ఫ్లాట్ రేట్స్ కావడంతో సీడెడ్ ఏరియాలో కూడా భారీగా రూ. 4.15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం బాహుబలి తొలిరోజు వసూళ్లను సైతం దాటేసింది. వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఏరియాల్లో బాహుబలికంటే ఎక్కువ వసూలు చేయడం గమనార్మం.
ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా సర్దార్ గబ్బ్ సింగ్ వసూళ్లు అదిరిపోయాయి. నార్త్ అమెరికాలో గురువారం రాత్రి నుండే సర్దర్ గబ్బర్ సంగ్ షోలు మొదలయ్యాయి. దాదాపు 300 స్క్రీన్లలో సినిమా వేసారు. కొన్ని ఏరియాల్లో టికెట్ రేటు 25 డాలర్లకు పెంచారు. తొలి రోజు ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద $615,853 (రూ. 4.10 కోట్లు) వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు!