‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ డే కలెక్షన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 11 న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఛానళ్ల తర్వాత కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ చేసాడు మహేష్. అసలు ఆయనలో ఇంత ఎనర్జీ దాగుందా అని ఆశ్చర్య పడేలా వన్ మ్యాన్ షో చేసేసాడు మహేష్. ఇక ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 8.67 cr
సీడెడ్ 4.15 cr
ఉత్తరాంధ్ర 4.40 cr
ఈస్ట్ 3.35 cr
వెస్ట్ 2.72 cr
కృష్ణా 3.07 cr
గుంటూరు 5.14 cr
నెల్లూరు 1.27 cr
ఏపీ+తెలంగాణ 32.77 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.27 cr
ఓవర్సీస్ 5.56 cr
వరల్డ్ వైడ్ టోటల్ 42.60 cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 42 కోట్ల వరకూ షేర్ వచ్చింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 60 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈరోజు అంటే.. జనవరి 12న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదల అయ్యింది. ఆ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ చిత్రం వల్ల ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్లు దెబ్బ తినే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus