‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో చిత్రాలకి రిపీట్ ఆడియన్స్ వచ్చే ఛాన్స్ ఉందా?

2020 వ సంక్రాంతి చాలా స్పెషల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి కి కూడా 4 సినిమాలు బరిలో దిగడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం రజినీ కాంత్ ‘దర్బార్’ యావరేజ్ గా, ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ గా, ‘అల వైకుంఠపురములో’ కూడా హిట్ అనే టాక్స్ ను సంపాదించుకున్నాయి.’ఎంత మంచివాడవురా’ జనవరి 15న రిలీజ్ కావాల్సి ఉంది. ఆ చిత్రం స్టార్ హీరో సినిమా కానప్పటికీ ఫ్యామిలీ చిత్రం కాబట్టి దాని బిజినెస్ అది చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే సంక్రాంతి కి రిపీట్ ఆడియన్స్ వచ్చే సినిమాకే విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది.

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మహేష్ అభిమానులు అండ్ మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రిపీట్ గా చూసే అవకాశం ఉంది. ఎక్కువ ఛాన్స్ లు ఈ చిత్రానికి ఉన్నాయి. అయితే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి రివ్యూ లు మరింత బాగా వచ్చాయి. బన్నీ కి యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ కు సినిమాలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.. సో వీళ్ళు కూడా ఈ చిత్రాన్ని రిపీట్ గా చూసే అవకాశం ఉంది. మాస్ ప్రేక్షకులకి ఈ చిత్రం రుచించక పోవచ్చు. ఇక ‘దర్బార్’ కు రిపీట్ ఆడియన్స్ ఛాన్స్ లు చాలా తక్కువనే చెప్పాలి. మరి పై చెప్పిన ఛాన్స్ లను బట్టి పండగ ముగిశాక కూడా ఏ చిత్రం జోరు కనపరుస్తుందో చూద్దాం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus