‘సరిపోదా శనివారం’… ఇదేంటి టైటిల్ ఇలా పెట్టారు అని ఎప్పుడైనా అనుకున్నారా? నాకు తెలిసి నాని ఫ్యాన్స్ అంటే సినిమా ఫ్యాన్స్ కాబట్టి చాలామంది ఇదే మాట అనుకుని ఉంటారు. మామూలుగానే ఆయన సినిమాలు కొత్తగా ఉంటాయి, అందులో వివేక్ ఆత్రేయ లాంటి దర్శకుడు చేస్తున్న సినిమా కాబట్టి ఇంకా కొత్తగా ఉంటుంది. ఈ లెక్కన ఆ టైటిల్‌కి ఏదో అర్థం ఉంది, ఇంకేదో పరమార్థం ఉంది అని అనుకునే ఉంటారు. అనుకున్నట్లుగానే ఆ టైటిల్‌లో చాలా ఉంది.
‘నాకు కోపమొస్తే మనిషిని కాను’ అనే డైలాగ్ ఎప్పుడైనా విన్నారా? ఆ మాటకొస్తే వినడమే కాదు అనే ఉంటారు కూడా. అయితే ‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరో ఈ డైలాగ్‌ను కాస్త మార్చి చెబుతాడు. అదే ‘శనివారం వస్తే నేను మనిషిని కాను.. ఆ రోజు కోపమొస్తే నన్నాపలేరు’ అని అంటాడు. అదేంటి శనివారం కోపం రావడమేంటి అని అనుకుంటున్నారా? ఈ సినిమాలో మెయిన్ పాయింటే ఇది. నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
అందులో ఈ పాయింటే హైలైట్. అంటే ఈ సినిమాలో నానికి కోపమొస్తే ఆ రియాక్షన్ కేవలం శనివారం మాత్రమే చూపిస్తాడట. అది కూడా మామూలుగా ఉండదు. టూ మచ్ వైలెంట్‌గా ఉంటుంది. ఇందులో ఏమైనా డౌట్ ఉంది అంటే మీరు ఆ గ్లింప్స్ చూడనట్లే. ఒకానొక ఫ్రేమ్‌లో ‘ఓజీ’ సినిమాలో పవన్ కల్యాణ్‌లా నాని కనిపిస్తాడు అంటే అతిశయోక్తి కాదు. రెడ్ కలర్ స్మోక్ సీన్ అలానే ఉంటుంది మరి.
నాని మాస్‌లుక్‌లో కనిపించనున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రధారి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న సినిమాను రిలీజ్ చేస్తారని టాక్. అంటే ‘ఓజీ’ వచ్చేదానికి ఒక నెల ముందు అన్నమాట. నాని, ఎస్‌జే సూర్య ఈ సినిమాలో విశ్వరూపం చూపించారని టాక్. గ్లింప్స్‌లో అయితే ఎస్‌జే సూర్య అదరగొట్టేశాడు.
సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!