‘దేవర’ (Devara) వచ్చినా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సందడి తగ్గదా? అదెలా..? అనుకుంటున్నారా..?! అక్కడికే వస్తున్నా…! ఈ రోజుల్లో ఓ సినిమా 2 వారాల పాటు థియేటర్లలో నిలబడటమే పెద్ద టాస్క్. అది కూడా పాజిటివ్ టాక్ వస్తేనే.. అన్ని రోజులు క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే.. వీకెండ్ కే వాష్ అవుట్ అయిపోవడం గ్యారంటీ..! అలాంటిది ‘దేవర’ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంటే.. అప్పటివరకు.. థియేటర్లలో ‘సరిపోదా శనివారం’ పెర్ఫార్మ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు.
అయితే అదే రోజున అంటే సెప్టెంబర్ 27న.. ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుండి ‘సరిపోదా శనివారం’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందట. అప్పటికి ‘సరిపోదా’ రిలీజ్ అయ్యి 4 వారాలు పూర్తవుతుంది? ఇప్పుడు ఓటీటీలు ఓ సినిమా థియేట్రికల్ రన్ కి 4 వారాలు టైం ఇస్తున్నాయి. అది కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాకే.. అవి థియేట్రికల్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేస్తున్నాయి.
కాస్త పేరున్న సినిమా బడ్జెట్లో .. 50 శాతం రికవరీ అయ్యేది ఓటీటీల బిజినెస్ నుండే..! అందుకే నిర్మాతలకి ఓటీటీ సంస్థలు చెప్పింది చేయడం తప్ప.. ఇంకో ఆప్షన్ లేదు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాని కూడా హడావిడిగా ఆగస్టు 15 నే రిలీజ్ చేయడానికి, ఆగస్టు 14 నుండి ప్రీమియర్స్ వేయడానికి.. కారణం అదేనని టాక్.
అయితే ‘దేవర’ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంటే.. నాని (Nani) నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీ రిలీజ్ ను ఎంతమంది లక్ష్యపెడతారు? కానీ ‘సరిపోదా..’ కి హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. నానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంది కాబట్టి.. నెట్ ఫ్లిక్స్ లో ఆ సినిమా కొంతమేర సందడి చేసే ఛాన్స్ లేకపోలేదు.