Sarkaar’s Laathi: HIT 3 Teaser Review: అర్జున్ సర్కార్ లాఠీకి దొరికితే అంతే..!

‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ‘హిట్’ (HIT) ‘హిట్ 2’ (HIT 2) మంచి విజయాలు అందుకున్నాయి. వాటి తర్వాత ‘హిట్ 3’  (HIT 3)  తెరకెక్కుతుంది. ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను (Sailesh Kolanu)  ఈ 3వ భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. నాని ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కేజీఎఫ్ (KGF)  బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)  ఇందులో హీరోయిన్. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 1న సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతోంది.

Sarkaar’s Laathi: HIT 3 Teaser Review:

ఈరోజు అనగా ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు కావడంతో ‘హిట్ 3’ నుండి టీజర్ ని వదిలారు. ‘హిట్ 3’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1:44 నిమిషాల నిడివి కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్ బ్యాక్ డ్రాప్లో.. అభిలాష్(శ్రీనాథ్ మాగంటి) వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది. వరుసగా ఆ ప్రదేశంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి. చంపేసిన తర్వాత తలక్రిందులుగా శవాలను వేలాడదీసి చెట్లకు కట్టేసి వెళ్లిపోతుంటుంది విలన్ గ్యాంగ్.

ఆ కేసు కాంప్లికేట్ అవ్వడంతో అర్జున్ సర్కార్(నాని) కి అప్పగిస్తారు. అతను మహా కోపిష్టి. అందుకే ‘ఇతని లాఠీకి దొరికే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది’ అంటూ పై ఆఫీసర్ గా చేసిన రావు రమేష్ (Rao Ramesh)  పాత్రతో చెప్పించారు. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడనంత వయొలెంట్ గా కనిపిస్తున్నాడు. టెక్నికల్ గా కూడా ‘హిట్ 3’ టీజర్ బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus