మహేష్‌ సినిమాకి పరశు పక్కా ప్లానింగ్‌

‘సర్కారు వారి పాట’ సినిమా మేజర్‌ షూటింగ్‌ పార్ట్‌ అమెరికాలో చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే కరోనా పరిస్థితుల కారణంగా చిత్రీకరణను అమెరికా నుంచి దుబాయికి మార్చేశారు. ఇప్పటికే మహేష్‌బాబు అక్కడికి వెళ్లిపోగా.. చిత్రబృందం శుక్రవారం ఫ్లైట్‌ ఎక్కేసింది. దీంతో ఇక అమెరికా షెడ్యూల్‌ లేదని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్‌. సినిమాను అమెరికాలో కూడా చిత్రీకరిస్తారనేది తాజా వార్త. దుబాయి షెడ్యూల్‌ అయ్యాక అమెరికా వెళ్లాలనే ఆలోచనలో ఉందట ‘సర్కారు వారి పాట’ బృందం.

‘సర్కారు వారి పాట’ సినిమాకు అమెరికా షెడ్యూల్‌ కీలకంగా ఉంటుందని చిత్రబృందం తొలుత నుంచి చెబుతూ వస్తోంది. దర్శకుడు పరశురాం దానికి తగ్గట్టే బ్యాక్‌డ్రాప్‌ రాసుకున్నాడని వార్తలొచ్చాయి. అయితే దుబాయికి షూటింగ్‌ మార్చేయడంతో బ్యాక్‌డ్రాప్‌ కూడా మారిందని పుకార్లు వచ్చాయి. కానీ అలాంటిదేం లేదట. అంతేకాదు అమెరికాలో షూటింగ్‌ కూడా చేస్తారట. దుబాయి షెడ్యూల్‌ తర్వాత ఓ 20 రోజులు అమెరికాలో షెడ్యూల్‌ పెట్టాలని చూస్తున్నారట. ఈ రెండు షెడ్యూల్స్‌ కాకుండా హైదరాబాద్‌, గోవాలో కూడా షూట్‌ చేస్తారట.

ఈ నాలుగు షెడ్యూల్స్‌తో మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ అయిపోతుందని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే పరశురామ్‌ పక్కా ప్లానింగ్‌తో సినిమా ప్రారంభిస్తున్నాడని సమాచారం. సినిమా కోసం క్యాస్ట్‌ అండ్‌ క్రూ లిస్ట్‌ ఫైనల్‌కి వచ్చేసింది. ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ లాంటి సీనియర్లను సినిమాలోకి తీసుకున్నారట. వినోదం పంచడానికి వెన్నెల కిషోర్‌ కూడా ఉన్నాడట.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus