మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై విజయవంతంగా 2 వారాలు పూర్తిచేసుకుని 3 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను ముటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ‘ఎఫ్3’ రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడింది.
బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా పెద్ద టార్గెట్ నే ఛేజ్ చేయాల్సి ఉంది.ఒకసారి ‘సర్కారు వారి పాట’ 17 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 34.36 cr |
సీడెడ్ | 11.85 cr |
ఉత్తరాంధ్ర | 12.21 cr |
ఈస్ట్ | 8.79 cr |
వెస్ట్ | 5.55 cr |
గుంటూరు | 8.54 cr |
కృష్ణా | 6.21 cr |
నెల్లూరు | 3.62 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 91.13 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.75 cr |
ఓవర్సీస్ | 12.43 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 110.31 cr |
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.110.31 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.10.69 కోట్ల షేర్ ను రాబట్టాలి. నిన్న ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ అవ్వడంతో ‘సర్కారు వారి పాట’ కలెక్షన్ల పై గట్టి ఎఫెక్ట్ పడింది.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!