మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది. ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ అంచనాలను అందుకోలేదని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి. మెజారిటీ ఆడియన్స్ ఈ సినిమా వన్ టైమ్ వాచబుల్ మూవీ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రిలీజైన కొన్ని వారాలకే ఈ సినిమా రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.
ఆ తర్వాత మరికొన్ని వారాలకు ఉచితంగా ఈ సినిమాను చూసే అవకాశాన్ని అమెజాన్ ప్రైమ్ కల్పించింది. అయితే అమెజాన్ ప్రైమ్ లో చాలారోజుల క్రితమే అందుబాటులోకి వచ్చినా ఒక థియేటర్ లో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం. ఓటీటీల కాలంలో సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా 100 రోజుల పాటు ప్రదర్శించబడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కంటెంట్ పరంగా ఈ సినిమా వీక్ మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దర్శకుడు పరశురామ్ కొన్ని సన్నివేశాల విషయంలో కొరటాల శివను ఫాలో అయ్యారని ప్రచారం జరిగింది. వైజాగ్ లోని గోపాలపట్నంలో ఉన్న మౌర్య థియేటర్ లో ఈ సినిమా 100 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం. మహేష్ బాబు రికార్డ్ సేఫ్ అని అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఈ రికార్డ్ కోసం చాలా కష్టపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు కెరీర్ లోని పలు ఫ్లాప్ సినిమాలు సైతం పరిమిత సంఖ్యలో థియేటర్లలో 100 రోజుల పాటు ప్రదర్శించబడ్డాయి.
ఫ్యాన్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరని మహేష్ బాబు అభిమానులు ప్రూవ్ చేస్తున్నారు. మహేష్ తర్వాత సినిమాలు త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?