‘సర్కారు వారి పాట’ 100M రికార్డ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల సంఖ్య రోజురోజుకు మరింత పెరిగుతూ వస్తోంది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మహేష్ సినిమాను చాలా ఈజీగా ప్రమోట్ చేసేస్తున్నారు. మహేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ముందుగానే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. సూపర్ స్టార్ నుంచి నెక్స్ట్ సర్కారు వారి పాట అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా మొదటి షెడ్యూల్ కూడా ఇంకా పూర్తవ్వలేదు.

కానీ సినిమాకు సంబంధించిన ఎదో ఒకటి ట్విట్టర్ లో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక మొత్తానికి మహేష్ అభిమానులు సర్కారు వారి పాట టైటిల్ పై 100 మిలియన్ ట్వీట్స్ వేశారు. నెవర్ బిఫోర్ అనేలా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. నేడు దుబాయ్ లో సినిమా మొదటి షెడ్యూల్ మొదలు కానుంది. ఒక టైటిల్ తోనే ఈ రేంజ్ లో వైరల్ చేశారు అంటే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ వస్తే హడావుడి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక మహేష్ గత వారమే కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే భార్య నమ్రత పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరిగాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus