మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న(నిన్న) విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు మంచి కలెక్షన్లను సాధించింది. మహేష్ బాబు కెరీర్లోనే ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. మిక్స్డ్ టాక్ తో కూడా ఈ ఫీట్ ను సాధించడం విశేషంగానే చెప్పుకోవాలి.
పలు చోట్ల వర్షాలు పడడంతో నిన్న ఆఫ్ లైన్ బుకింగ్స్ పై కొంత ఎఫెక్ట్ పడింది. ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 12.24 cr |
సీడెడ్ | 4.70 cr |
ఉత్తరాంధ్ర | 3.73 cr |
ఈస్ట్ | 3.25 cr |
వెస్ట్ | 2.74 cr |
గుంటూరు | 5.83 cr |
కృష్ణా | 2.24 cr |
నెల్లూరు | 1.56 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 36.29 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.68 cr |
ఓవర్సీస్ | 6.47 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 45.44 cr |
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి రోజు రూ.45.44 కోట్ల షేర్ ను రాబట్టింది. ముందు నుండీ నెలకొన్న హైప్ కారణంగా మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.75.56 కోట్ల షేర్ ను రాబట్టాలి.
అది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. మొదటి రోజు డివైడ్ టాక్ రావడం వల్ల రెండో రోజు బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. మొదటి వీకెండ్ ఈ మూవీ భారీగా కలెక్ట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉండదు.
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!