Mahesh Babu: మహేష్ సినిమా ఆగస్టుకి వెళ్లిందట!

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ సినిమా ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారమైతే జనవరి 13న విడుదల కావాలి. కానీ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కోసం వాయిదా వేశారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఏప్రిల్ 1న సినిమా విడుదల చేయాలనుకున్నారు. నిజానికి ఏప్రిల్ వేసవి సీజన్ కాబట్టి నిర్మాతలు కూడా ఆసక్తి చూపారు. కానీ ఇప్పుడు ఆ డేట్ న కూడా సినిమా రావడం లేదని సమాచారం.

ఈ మధ్యకాలంలో మహేష్ జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. దాని వలన రెండు, మూడు వారాల నుంచి ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. ఇంతలోఎం మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణం వారి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. రమేష్ బాబుపై మహేష్ కి అమితమైన ప్రేమ ఉండేది. అన్నయ్యతో చాలా క్లోజ్ గా ఉంటాడు మహేష్. అలాంటిది సడెన్ గా తన అన్నయ్య మరణించడంతో మహేష్ తీవ్రమైన శోకంలో ఉన్నాడు.

దీంతో మరో నెల రోజుల పాటు షూటింగ్ కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో షూటింగ్ లకు ఇబ్బందిగా మారింది. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలియదు. దీంతో ఇప్పట్లో మహేష్ సినిమా రాదని అంటున్నారు. వేసవికి షూటింగ్ పూర్తయినా.. అప్పటికి మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ పెట్టుకుంటే మళ్లీ ‘సర్కారు వారి పాట’ను వాయిదా వేయాల్సి ఉంటుంది.

ఎలా చూసినా ఏప్రిల్ 1న సినిమా మాత్రం రాదని తెలుస్తోంది. దీంతో ఆగస్టు 5న సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై దర్శకనిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus