ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తూ అమెజాన్ ప్రైమ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలను తక్కువ సమయంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన అమెజాన్ ప్రైమ్ సర్కారు వారి పాట సినిమాను మాత్రం నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. జూన్ 10వ తేదీ నుంచి లేదా జూన్ 24వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని బోగట్టా,
సర్కారు వారి పాట సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎఫ్3 సినిమా థియేటర్లలో విడుదల కానుండటంతో సర్కారు వారి పాట సినిమా మెజారిటీ థియేటర్లను కోల్పోయింది. ఎఫ్3 సినిమా టాక్ ను బట్టి సర్కారు వారి పాట థియేటర్ల కేటాయింపు విషయంలో మార్పులు జరగనున్నాయి. హైదరాబాద్ లో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లలో సర్కారు వారి పాట సినిమా ప్రదర్శితమవుతోంది.
ఇప్పటికే దాదాపుగా 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సర్కారు వారి పాట మరో 10 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్లు ఈ సినిమాకు కీలకం కానున్నాయి. ఎఫ్3 సినిమాను దిల్ రాజు పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎఫ్3 సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వెంకీ, వరుణ్ కెరీర్ లో ఈ స్థాయిలో బిజినెస్ చేసిన మరో సినిమా లేదు.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది. కరోనా వల్ల రెండు వారాల గ్యాప్ లో పెద్ద సినిమాలు విడుదలవుతుండగా రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు నెల రోజుల గ్యాప్ తో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.