తెలుగు రాష్ట్రాల్లో సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇస్తున్నాయి. తొలుత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కాస్త బెట్టు చేసినా… తర్వాత కొన్ని షరతులతో ఓకే చేసింది. అయితే ఈ క్రమంలో ఇన్ని రోజులే ధరలు పెంచాలని లెక్క చెప్పారు కూడా. అనుకున్న రోజులు అయిపోయాయి కాబట్టి.. ‘సర్కారు వారి పాట’ టికెట్ రేట్లు ధరలు తగ్గించారు అంటూ సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ధరలు సాధారణం చేసేశారు అని కూడా చెబుతున్నారు. ఇందులో నిజమెంత?
మహేష్‌బాబు – కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజుల్లో డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే చిత్రబృందం మాత్రం సినిమా సూపర్, డూపర్, బంపర్ అంటూ వసూళ్ల లెక్కలు చెబుతోంది. ఇందులో నిజానిజాలు ఎంత అనే ప్రశ్న అయితే సోషల్ మీడియాలో వినిపిస్తోంది. హౌస్‌ఫుల్స్‌తో ఆదివారం అదిరిపోయిందంటూ ట్వీట్లు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆన్‌లైన్‌లో చూస్తే.. ఖాళీ సీట్లు కనిపించడం గమనార్హం.
ఇక హౌస్‌ఫుల్స్ సంగతి పక్కనపెడితే.. సినిమా టికెట్ ధరల సంగతి చూడొచ్చు. తెలంగాణలో సినిమా టికెట్ ధరలు తగ్గించారు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై సినిమా బృందం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదనుకోండి. అయినా అధికారిక ప్రకటన ఇచ్చిన ‘ఎఫ్ 3’ కే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. ‘సర్కారు వారి పాట’ టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో చూస్తే ఆ పాత రూ. 175, రూ. 295 ధరలే కనిపిస్తున్నాయి.
ఈ ధరలు అంటే మొన్నీ మధ్య పెంచిన రేట్లే అని చెప్పొచ్చు. అయితే రిలీజ్ సమయంలో ఈ ధర ఇంకాస్త ఎక్కువ ఉండేది అనుకోండి. అంటే సుమారు రూ. 200, రూ. 345గా ఉండేది. ఈ లెక్కన చూస్తే తగ్గించినట్లే కానీ, పూర్తిగా పాత రేట్లు వచ్చినట్లు కాదు. కాబట్టి ‘సర్కారు వారి ’ అధిక వసూళ్లు ఇంకా కొనసాగుతున్నాయనే చెప్పొచ్చు. దీంతో అసలు టికెట్ రేట్లు తగ్గించారా లేదా అనే విషయంలో చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!