Puneeth Rajkumar Satellite: ‘అప్పు’కి అరుదైన గౌరవం.. ఆనందంలో కన్నడ ప్రజలు!

‘కన్నడ కంఠీరవ’ డా. రాజ్ కుమార్ తనయుడు, ‘కరుణాడ చక్రవర్తి’ డా, శివ రాజ్ కుమార్ సోదరుడు, కన్నడ ‘పవర్ స్టార్‘ స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ ప్రధమ వర్థంతి అలాగే కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం ఇచ్చింది. పునీత్ సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్‌, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు..

ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం పునీత్‌కి మరో అరుదైన గౌరవాన్నిఅందించనుంది.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. చిన్న వయసులోనే మరణించారు కానీ బతికినంత కాలం ప్రజలు తనను పదికాలాల పాటు గుర్తుంచుకునేంత గొప్పగా బతికారు.. ఆయన మరణించి ఏడాది అవుతున్నా కానీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, కన్నడ ప్రజలు ఇప్పటికీ పునీత్ ఇకలేరనే మాట నిజం కాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు..

కర్ణాటక ప్రభుత్వం పునీత్ కీర్తిని ఆకాశపు అంచుల్లోకి తీసుకెళ్లబోతోంది.. ఓ శాటిలైట్‌కి పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టాలని నిర్ణయించుకుంది.. పునీత్ అందించిన సేవలకు గానూ ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కుతుంది.. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్రో దేశీయంగా రూపొందించిన 75 ఉపగ్రహాలను ప్రయోగించబోతుంది. ఈ ఉపగ్రహాలన్నింటినీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించడం మరో విశేషం.

ఈ క్రమంలోనే కర్ణాటక గవర్నమెంట్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ తయారు చేయనున్న శాటిలైట్‌కు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టనుంది. తొలుత ఈ ఉపగ్రహానికి KGS3Sat అనే నేమ్ ఫిక్స్ చేశారు. తర్వాత దానికి పునీత్‌ పేరు పెట్టి.. ‘‘శాటిలైట్‌ పునీత్‌’’ గా మార్చారు. దీని తయారీ కోసం కర్ణాటకలోని అనేక ప్రాంతాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అనేక మోడళ్లు పంపారు. వాటిలో ఉత్తమమైన వాటిని పంపిన 1000 మంది విద్యార్థులను ఎంపిక చేసిన శాస్త్రవేత్తలు వారికి శిక్షణనిచ్చి ‘‘శాటిలైట్ పునీత్’’ తయారీకి పరిశోధనలను ప్రారంభించారు.

శాటిలైట్ తయారీకయ్యే ఖర్చు ఎంతంటే..

శాటిలైట్‌ పునీత్‌ కోసం మొత్తం… కోటి 90 లక్షల రూపాయల ఖర్చు అవుతోంది. కిలోన్నర బరువుండే ‘‘శాటిలైట్ పునీత్’’ పూర్తి కాగానే దాన్ని ఏపీలోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్‌కు తరలిస్తారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నవంబర్‌ 15-డిసెంబర్‌ 31 మధ్యలో ఈ ‘‘శాటిలైట్ పునీత్‌’’ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా 50కిలోల బరువు, 50-60 కోట్ల ఖర్చు పెడితే కానీ పూర్తికానీ ఈ శాటిలైట్‌ను.. స్వదేశీ టెక్నాలజీ వినియోగించటం ద్వారా కేవలం కోటి 90 లక్షల రూపాయల ఖర్చులో కిలోన్నర బరువులోనే పూర్తి చేయనున్నారు.

సంతోషంలో అభిమానులు.. కన్నడ ప్రజలు..

విద్యార్థులకు శిక్షణనిచ్చి, గైడ్ చేసేందుకు కర్ణాటక వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు ముందుకు వస్తున్నారు. ‘‘కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ ఖ్యాతి అంతరిక్షానికి చేరుతుంది.. ఆయన చేసిన సేవలకు ఇది సరైన గౌరవం అని ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus