కార్తీ (Karthi) , అరవింద్ స్వామి (Arvind Swamy) కాంబినేషన్లో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హగన్) అనే సినిమా రూపొందింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఇంప్రెస్ చేశాయి. తమిళంలో ’96’, తెలుగులో ‘జాను'(96 రీమేక్) వంటి సినిమాలు చేసిన సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్’ సంస్థ విడుదల చేసింది.
మొదటి రోజు ఈ సినిమా తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ‘దేవర’ పోటీగా ఉండటంతో.. ఓపెనింగ్స్, పర్వాలేదు అనిపించే విధంగా మాత్రమే నమోదయ్యాయి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.28 cr |
సీడెడ్ | 0.51 cr |
ఉత్తరాంధ్ర | 0.58 cr |
ఈస్ట్+వెస్ట్ | 0.30 cr |
కృష్ణా + గుంటూరు | 0.39 cr |
నెల్లూరు | 0.19 cr |
ఏపి+ తెలంగాణ | 3.25 cr |
‘సత్యం సుందరం’ చిత్రానికి రూ.6.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ చిత్రం రూ.3.25 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం ఇంకా రూ.3.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను గట్టిగా వాడుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా లేవు.