మంచి వాడితో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడే..

‘దొంగల బండి’ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న. ఆ తరువాత ‘రామదండు’ అనే సినిమా చేసి క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. అయితే 2017 లో వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు ఏకంగా నేషనల్ అవార్డు రప్పించాడు ఈ డైరెక్టర్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం .. పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. పోటీగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ అలాగే బాలకృష్ణ 100 వ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలు ఉన్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.

ఇక అటు తరువాత నితిన్ తో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. యూత్ ను అట్రాక్ట్ చేసే ఎలెమెంట్స్ లోపించడం వలనే.. అలా జరిగిందని అభిప్రాయ పడ్డారు. అయితే ఈసారి కళ్యాణ్ రామ్ తో చేయబోతున్న ‘ఎంత మంచివాడవురా’ చిత్రం విషయంలో మాత్రం అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ ‘దర్బార్’ వంటి పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ‘ఎంత మంచివాడవురా’ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందని.. కొందరు ఫిలిం విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఈ చిత్రం పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘ఆదిత్య మ్యూజిక్’ బ్యానర్ పై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నైజాంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడని సమాచారం.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus