కథాబలం ఉన్న సినిమాలలో హీరోగా నటిస్తూ సత్యదేవ్ నటుడిగా పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారనే సంగతి తెలిసిందే. సత్యదేవ్ నటించి థియేటర్లలో విడుదలైన తిమ్మరుసు సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు బాగానే కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన ఇష్క్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకులు తిమ్మరుసు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ప్రూవ్ చేసుకున్న సత్యదేవ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బీర్బల్ సినిమాకు రీమేక్ గా తిమ్మరుసు సినిమా తెరకెక్కగా మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మించారు. సినిమాలోని ట్విస్టులతో పాటు సత్యదేవ్ నటన, బ్రహ్మాజీ కామెడీ సినిమాకు హైలెట్ గా నిలవడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ వల్ల మూతబడిన థియేటర్లు తాజాగా తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయగా నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్మాతలకు డిజిటల్ హక్కుల ద్వారా భారీగా ఆదాయం చేకూరుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో ఈ సినిమా రిలీజ్ కాలేదు. అందువల్ల ఏపీ ప్రేక్షకులలో చాలామంది ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!