మొత్తానికి క్లారిటీ ఇచ్చిన ‘సవ్యసాచి’ దర్శకుడు…!

Advertisement

అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య ను… ఇండస్ట్రీలో అందరూ కూల్ బాయ్ అంటుంటారు. అక్కినేని అభిమానుల మేరకు మాస్ హీరో అవ్వలేకపోయినా… క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం దగ్గరయ్యాడు. సినీ రంగంలో స్టార్ హీరోలు అలాగే వారి కుటుంబంలో సభ్యుల గురించి ఎక్కువగా రూమర్స్ వస్తుంటాయి. అదే కోవలో చైతన్య పై కూడా వచ్చినా… ఇప్పటి వరకూ కూల్ గా వాటిని పరిష్కరించేసాడు. అయితే చైతూ షూటింగ్ సమయంలో ఓ దర్శకుడితో గొడవ పడ్డాడు.. అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తరువాత ఆ వార్తల గురించి అందరూ మర్చిపోయినా… అప్పుడప్పుడు ఆ టాపిక్ పైనడిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి.వివరాల్లోకి వెళితే… కార్తికేయ దర్శకుడు చందూ మొండేటి… నాగ చైతన్య కు ‘ప్రేమమ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అదే నమ్మకంతో చందూ మొండేటితో… ‘సవ్యసాచి’ అనే చిత్రం చేసాడు చైతూ. అయితే ఈ చిత్రం షూటింగ్ టైములో వీరి మధ్య గొడవ జరిగిందట. సినిమా రిలీజయ్యి ప్లాప్ అయ్యాక ఆ గొడవ మరింత పెరిగింది అని టాక్ వినిపించింది.

అయితే తాజాగా ఆ విషయం పై క్లారిటీ ఇచ్చాడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చాడు. “నేను .. చై తో గొడవ పడినట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. నాకున్న మంచి స్నేహితుల్లో చై కూడా ఒకరు.అతనితో మళ్ళీ మరో సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ‘కార్తికేయ 2’ సినిమా పనుల్లో బిజీగా వున్నాను. ఈ చిత్రం హిట్ అయితే, చైతూ దగ్గర నుండీ కాల్ వస్తుందనే అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు చందూ.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus