గాలి సంపత్ సెకండ్ హాఫ్ హైలెట్ అంట..!

రీసంట్ గా రిలీజైన గాలిసంపత్ ట్రైలర్ ఇప్పుడు సినీ లవర్స్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ నటన అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. డైలాగ్స్ లేకండా కేవలం ‘ఫిఫీ’ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నారు రాజేంద్రప్రసాద్. హీరో శ్రీవిష్ణు రాజేంద్రప్రసాద్ ఇద్దరూ తండ్రీ కొడుకులుగా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. రజిత హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమాని అనిల్ రావిపూడి సమర్పిస్తున్నారు. అంతేకాదు, డైరెక్షన్ పర్యవేక్షణతో పాటుగా స్క్రీన్ ప్లే డైలాగ్స్ ని అందించడంతో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తినెలకొంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ హిట్స్ ని అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ గాలిసంపత్ సినిమా కూడా హిట్ అయితే అనిల్ రావిపూడి ఖాతాలోనే పడిపోతుంది. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ శ్రీవిష్ణుల మద్యన వచ్చే హై డ్రామా సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో రాజేంద్రప్రసాద్ ఒక 30 అడుగుల లోతున్న బావిలో పడిపోతాడని, అక్కడ్నుంచీ సినిమా చాలా టెన్షన్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఒక యాక్సిడెంట్ లో రాజేంద్రప్రసాద్ కి గొంతుపోతుందని, అప్పట్నుంచీ ఏది మాట్లాడాలన్నా కూడా ఫిఫీ భాషలో మాట్లాడుతూ గాలితోనే సంభాషిస్తాడని అందుకే సినిమాకి గాలి సంపత్ అని పేరు పెట్టారని అంటోంది మూవీ టీమ్.

అలాంటి ఒక తండ్రిలాంటి మాటలు రాని క్యారెక్టర్ బావిలో పడిపోతే ఏమైవుతుంది. అసలు బయటకి వస్తాడా.. లేదా అక్కడే చనిపోతాడా అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని అంటున్నారు. అందుకే, సినిమా సెకండ్ హాఫ్ సూపర్బ్ గా ఉంటుందట. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా అనిల్ మార్క్ కామెడీ ఉంటుందని, పంచ్ డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ప్రామిస్ చేస్తోంది మూవీ టీమ్. ఈ సినిమా మార్చి 11న విడుదల కాబోతోంది. మరి ఈ గాలిసంపత్ తెలుగు ప్రేక్షకులని ఎలా మెప్పిస్తాడు అనేది ఆసక్తికరం.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus